Chiranjeevi Megastar:సినీ ఇండస్ట్రీలో ఏకదాటిగా ముప్పయ్ ఏళ్ళపాటు నెంబర్ వన్ హీరోగా మెగాస్టార్ చిరు చక్రం తిప్పిన సంగతి తెల్సిందే. అయితే ఇప్పుడు మెగా స్టార్ గా మీరు గుర్తించడం కాదు.కెరీర్ తొలినాళ్ళల్లోనే ఇండస్ట్రీకి మొగుడు అవుతాడని చెప్పానని తెలిపారు వెటరన్ స్టార్ మురళీమోహన్.
మన ఊరి పాండవులు సినిమా చేసేటప్పుడే
విషయంలోకి వెళ్తే రాజమండ్రిలోని కపిలేశ్వరంలోజిఎస్ ఎల్ సూర్య ట్రస్ట్(GSL Suriya Trust) గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రారంభించిన సంగతి తెల్సిందే .ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళీమోహన్ మాట్లాడుతూ చిరంజీవితో మన ఊరి పాండవులు సినిమా చేసేటప్పుడే మంచి పరిచయం ఏర్పడిందని తెలిపారు.
మన ఇండస్ట్రీకి మొగుడు అయి కూర్చుంటాడు
ఆ షూటింగ్ లో చిరంజీవి బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు చూసిన కృష్ణం రాజు మురళీమోహన్ తో మన ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికాడు అని అనగా విలన్ ఏంటండీ బాబు మన ఇండస్ట్రీకి మొగుడు అయి కూర్చుంటాడు అని ఆనాడే చెప్పానని ,సరిగ్గా తన కష్టంతో అలాగే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇపుడు ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాడని చిరుని ఆకాశానికి ఎత్తేశాడు.
చిరుపై ప్రశంసలు కురిపించిన మురళీ మోహన్
ఇక మనమందరం రోజూ ఇడ్లీ, పూరి ,చపాతీ ఇలా ఎదో ఒకటి తింటుంటామని కానీ చిరంజీవి కేవలం ఒక ఇడ్లీలో సగం మాత్రమే తింటాడని ,అలా నోటిని కంట్రోల్ చేసుకోబట్టే ఇప్పటికీ ఎంతో యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్స్ తో డాన్స్ లు ,విలన్స్ తో ఫైట్స్ చేస్తున్నాడని చిరుపై ప్రశంసలు కురిపించాడు.
మొత్తానికి ఇప్పుడంటే చిరు తనదైన శ్రమతో నెంబర్ వన్ గా ఎదిగిన తీరుని మనం చూస్తున్నాం కాని ,అసలు ఎలాంటి సినిమాలు చేయకుండానే కేవలం ఒక సినిమాలో సైడ్ రోల్ చేసిన తీరుని చూసే మురళీ మోహన్ చిరంజీవి టాలెంట్ ని పసిగట్టి ఇండస్ట్రీని ఏలతాడు అని చెప్పడం గమనార్హం.
లాంటి ఫలితాన్ని రాబడతాడో !
ఇక చిరు విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో కాకాఅనే సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే.గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ALSO READ :ఒక్కో ఈవెంట్‌కు లక్షల్లో పారితోషికం.. స్టార్ యాంకర్ల రేంజే వేరు!
ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి కాకాగా రాబోతున్న చిరు ఆ పొంగల్ దంగల్ లో ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో !