Amazon Great Indian Festival 2026: పండుగల సీజన్ వచ్చేసింది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనడానికి, పాత వాటి స్థానంలో సరికొత్త మోడళ్లను ఇంటికి తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం. ముఖ్యంగా మీ ఇంట్లో పాత వాషింగ్ మెషీన్ సరిగ్గా పనిచేయక ఇబ్బంది పడుతుంటే లేదా కొత్త ఇంటి కోసం బెస్ట్ మోడల్ కోసం చూస్తుంటే మీకు ఒక మంచి అవకాశం అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రముఖ బ్రాండ్ల వాషింగ్ మెషీన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
ఈ సేల్‌లో ఎక్కువగా ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఇవి వేగంగా ఉతకడమే కాకుండా బట్టలు త్వరగా ఆరేలా చేసే స్టీమ్ క్లీనింగ్, ఇన్వర్టర్ మోటార్ సాంకేతికతతో వస్తున్నాయి. శాంసంగ్, ఎల్‌జీ, బాష్ వంటి ప్రముఖ కంపెనీలు ఏఐ ఫీచర్లు, వైఫై కనెక్టివిటీని అందిస్తున్నాయి. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ నుంచే మెషీన్‌ను సులభంగా ఆపరేట్ చేయవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండటంతో తక్కువ ధరకే ఇవి లభిస్తున్నాయి.
Also Read: మ్యాక్‌బుక్ కొనాలనే డ్రీమ్ నెరవేర్చుకునే టైమ్ వచ్చింది.. అమెజాన్ సేల్‌లో రూ.68 వేలకే లభ్యం!
పెద్ద కుటుంబాలకు సరిపోయే శాంసంగ్ 12 కేజీల ఫ్రంట్ లోడింగ్ మోడల్‌పై భారీ తగ్గింపు ఉంది. దీని అసలు ధర రూ.60,990 కాగా.. రూ.2,000 కూపన్, రూ.5,000 బ్యాంక్ ఆఫర్, రూ.1,394 క్యాష్‌బ్యాక్ కలిపి రూ.46,490కే సొంతం చేసుకోవచ్చు. దీనికి 5 స్టార్ రేటింగ్ ఉండటంతో కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. పాత మెషీన్ మార్చుకుంటే రూ.2,130 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది.
ఎల్‌జీ 9 కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ.53,990 ఉండగా.. తగ్గింపుల తర్వాత రూ.40,989 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఇందులో రూ.250 కూపన్, రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్, రూ.1,229 క్యాష్‌బ్యాక్ ఉన్నాయి. పాత మెషీన్‌పై రూ.2,120 ఎక్స్ఛేంజ్ లభిస్తుంది. అలాగే బాష్ 9 కేజీల మోడల్ రూ.37,889కి, ఐఎఫ్‌బీ 9 కేజీలు రూ.30,240కి, హయ్యర్ 7 కేజీలు రూ.27,990కే అందుబాటులో ఉన్నాయి.
ఎస్బీఐ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ వాడితే 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్, అమెజాన్ పే లేటర్ ఈఎంఐలపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఆఫర్లు ముగిసేలోపే మీకు నచ్చిన మోడల్‌ను సొంతం చేసుకోండి.
Also Read: ఇంట్లోనే కెఫే లాంటి కాఫీ రావాలా? రూ.15,000 బడ్జెట్‌లో బెస్ట్ కాఫీ మెషిన్స్ ఇవే!