E-Paper
Advertisement

పర్ఫెక్ట్ కొలతలతో గుమగుమలాడే సెమియా కేసరి..క్షణాల్లోనే రెడీ అవుతుంది

పర్ఫెక్ట్ కొలతలతో గుమగుమలాడే సెమియా కేసరి..క్షణాల్లోనే రెడీ అవుతుంది
Advertisement

Semiya kesari recipe in telugu: ఇంట్లో ఎప్పుడైనా అప్పటి కప్పుడు తియ్యగా ఏదైనా తినాలనిపిస్తే, లేదా పండగలు, ప్రత్యేక రోజుల్లో క్షణాల్లో చేసుకునే అద్భుతమైన స్వీట్ ‘సెమియా కేసరి’. సాధారణ రవ్వ కేసరి కంటే.. సెమియా కేసరి రుచి మరింత ప్రత్యేకంగా ఉంటుంది. చాలా మందికి ఇది హోటళ్లలో లేదా ఫంక్షన్లలో తిన్న రుచిలా ఇంట్లో కుదరదు. అయితే.. సరైన కొలతలతో మరియు పర్ఫెక్ట్ రెసిపీతో చేస్తే రెస్టారెంట్ టేస్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎంతో ఈజీగా, తక్కువ ఖర్చుతో నోట్లో వెన్నలా కరిగిపోయే సెమియా కేసరిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!

ఇండియన్ వంటకాల్లో స్వీట్లకు ఉండే ప్రత్యేకతే వేరు. అందులోనూ ఇంట్లోనే తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేసుకునే స్వీట్లలో సెమియా కేసరి ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మందికి సెమియా కేసరి చేసేటప్పుడు సెమియా ముక్కలు మెత్తగా అయిపోవడం లేదా ఉండలు కట్టిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ.. ఇక్కడ చెప్పబోయే పర్ఫెక్ట్ కొలతలను పాటిస్తే.. మొదటి సారే అద్భుతమైన, పొడిపొడిగా ఉండే సెమియా కేసరిని తయారు చేయెచ్చు.

కావలసిన పదార్థాలు :

Advertisement

సెమియా : 1 కప్పు

నెయ్యి : 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు

Advertisement

పంచదార : 1 కప్పు

నీళ్లు: 2 కప్పులు

డ్రై ఫ్రూట్స్ : గుప్పెడు

యాలకుల పొడి : అర టీస్పూన్

ఫుడ్ కలర్: చిటికెడు

తయారీ విధానం :

1. మొదటగా స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు సెమియా వేసి, మంటను మీడియంలో ఉంచి మంచి బంగారు రంగు వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. సెమియా సరిగ్గా వేగితేనే. కేసరి పొడి పొడిగా వస్తుంది.

2. సెమియా బాగా వేగిన తర్వాత..అదే పాన్‌లో 2 కప్పుల నీళ్లు పోయాలి. మంటను మీడియంలో ఉంచి సెమియా నీటిలో పూర్తిగా ఉడికేలా ఉంచాలి. నీరంతా ఇంకిపోయి సెమియా మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించాలి. సెమియా పూర్తిగా ఉడికిన తర్వాతే పంచదార కలపాలి, లేదంటే సెమియా గట్టిగా ఉండిపోతుంది.

3.సెమియా ఉడికిన తర్వాత అందులో.. 1 కప్పు పంచదార వేయాలి. పంచదార కరిగినప్పుడు మిశ్రమం కొద్దిగా పల్చగా మారుతుంది. ఆ సమయంలోనే చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్, అర టీస్పూన్ యాలకుల పొడిని కలపాలి. పంచదార పాకం సెమియాకి బాగా పట్టి దగ్గరగా వచ్చే వరకు కలపాలి.

4.చివరగా మిగిలిన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను కేసరిలో కలపాలి. మంటను సిమ్‌లో ఉంచి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే నెయ్యి పైకి తేలుతుంది. అంతే.. గుమగుమలాడే నోరూరించే సెమియా కేసరి సిద్ధం!

ఈ పర్ఫెక్ట్ కొలతలతో చేసిన సెమియా కేసరి వేడి వేడిగా లేదా చల్లారిన తర్వాత.. తింటే అమృతంలా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు లేదా పండగ రోజుల్లో కేవలం 15 నిమిషాల్లో ఈ ట్రెండీ స్వీట్‌ను తయారు చేయండి.

Related News

పక్కా తెలంగాణ స్టైల్ సర్వపిండి..ఒక్క సారి టేస్ట్ చేేస్తే అస్సలు వదలరు!

పర్ఫెక్ట్ కొలతలతో..నోరూరించే బ్రెడ్ హల్వా రెసిపీ

పప్పుచారులో నంజుకోవడానికి బాప్‌లాంటి ‘కరివేపాకు రొయ్యల వేపుడు’.. తింటే ఫిదా అయిపోతారు!

రాయలసీమ స్టైల్ నాటుకోడి వెల్లుల్లి కారం.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా!

బోటీ కూర అంటే ఇష్టముండదా? చింతచిగురుతో ఇలా చేస్తే ప్లేట్లు నాకేస్తారు!

రైస్ వాటర్‌తో మెరిసే జుట్టు, గ్లాస్ స్కిన్ సాధ్యమేనా? సోషల్ మీడియాలో చెప్పేదంతా నిజమేనా?

మధ్యాహ్నం కాగానే కళ్లు మూతలు పడుతున్నాయా? శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్ ఇది!

Big Stories

Advertisement
×