Anchor Remuneration:ఏ ఈవెంట్ జరగాలన్నా,టీవీ షోస్ సక్సెస్ ఫుల్ గా సాగాలన్న యాంకర్ అనే వారు చాలా ముఖ్యం.ఇక సినిమా ఇండస్ట్రీ లో అయితే యాంకర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చెప్పక్కర్లేదు. టీజర్ లాంచ్ కావాలన్న, ట్రైలర్ ఈవెంట్ జరగాలన్నా,ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కావాలన్నా యాంకర్ లేనిదే పని జరగదు.
ఇక టీవీలలో వచ్చే ఎన్నో షోస్ కి ఫస్ట్ ఫేస్ గా కనిపించి అలరించేది ఈ యాంకరే.అందుకే మాటలతో ఆడియన్స్ ని కట్టి పడేసే ఈ యాంకర్ లకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది.ముఖ్యంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్ అంటే సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు, అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్, శ్రీముఖి వంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి.మరి వీళ్ళు యాంకరింగ్ చేయాలంటే పారితోషికం ఏ రేంజ్ లో పుచ్చుకుంటారో చూసేద్దాం
సుమ ప్రస్తుతం ఒక్కో ఈవెంట్ కి దాదాపుగా
ప్రస్తుతం ఇండస్ట్రీలలో స్టార్ యాంకర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు సుమ కనకాలది.ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఆడియో ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీత్స్ ,సెలెబ్రెటీల ఇంటర్వ్యూస్ ఇలా..ఏ కార్యక్రమం జరిగినా సుమ ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నట్టుగా అయిపొయింది. అలాంటి సుమ ప్రస్తుతం ఒక్కో ఈవెంట్ కి దాదాపుగా 3 నుండి 6 లక్షల మధ్యలో ,సినిమా రేంజ్ ని బట్టి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక సెలెబ్రెటీల ఇంటర్వ్యూకి 1 లక్ష నుండి మూడు లక్షల మధ్యక్లో తీసుకుంటుందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. ఇక చిన్నా చితకా ఇంటర్వ్యూలకి కూడా సుమ భారీగానే వసూలు చేస్తుందని ఫిలిం నగర్ టాక్.
నిజానికి సుమ ఆ రేంజ్ లో వసూలు చేయడానికి కారణం ఆమెకున్న పాపులారిటీ అనే చెప్పాలి. ముఖ్యంగా స్టేజ్ ఎక్కితే సుమ ఆడియన్స్ ని తనదైన మాటలతో ఏ రేంజ్ లో ఎంగేజ్ చేస్తుందో చెప్పక్కర్లేదు.
సుడిగాలి సుదీర్ ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా
ఇక సుమ తర్వాత ప్రస్తుతం ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నదేవరంటే సుడిగాలి సుదీర్ పేరే వినిపిస్తుంది. మ్యాజిక్ షోలు చేసుకుంటూ చిన్నగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి క్రమంగా స్టార్ పార్టిసిపెంట్ గా ఎదిగిన సుదీర్ ప్రస్తుతం డీ వంటి క్రేజీ షోకి యాంకర్ గా చేస్తున్న సంగతి తెల్సిందే.
ఇక సోషల్ మీడియాలో ఈయనకున్న ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అయితే ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా 2నుండి 4 లక్షల మధ్యలో వసూలు చేస్తున్నాడని సమాచారం.ఇక సుదీర్ ఒక వైపు షోలు చేస్తూనే మరో వైపు హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సంగతి
ప్రదీప్ ఒక్కో షోకి యాంకర్ గా చేయడానికి
ఇక సుధీర్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రదీప్ మాచి రాజు.సెలెబ్రిటీలతో స్పెషల్ గా ఎంటర్ టైన్ మెంట్ షోలు, టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూనే మరో వైపు సినిమలాలో హీరోగా ప్రయత్నాలు చేస్తున్న ప్రదీప్ ఒక్కో షోకి యాంకర్ గా చేయడానికి దాదాపుగా 1.5డి 3.5లక్షల మధ్యలో వసూలు చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.
యాంకరింగ్ లో కాస్త వెనకబడ్డప్పటికీ అనసూయ కూడా
ఇక యాంకర్ గా ఎన్నో షోస్ చేసిన అనసూయ ప్రస్తుతం సినిమాలలో బాగా బిజీ అయిపోయిన సంగతి తెల్సిందే.ముఖ్యంగా రవికాంత్ పెరేపు దర్శకత్వంలో వచ్చిన క్షణం సినిమాతో బిజీ అయిపోయిన అనసూయ సుక్కు దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం, పుష్ప సినిమాలతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ కొట్టేసింది. అయితే ఇప్పుడు యాంకరింగ్ లో కాస్త వెనకబడ్డప్పటికీ ఒక్కో షోకి ఈ భామ కూడా రెండు నుండి మూడు లక్షల వరకు తగ్గకుండా డిమాండ్ చేస్తుందని వినిపిస్తుంది.
షో లేదా ఈవెంట్ స్థాయిని బట్టి
ఇక వీరితో పాటు రష్మి గౌతమ్, శ్రీముఖి,అనసూయ,మంజూష,స్రవంతి చొక్కారపు వంటి వారు కూడా షో లేదా ఈవెంట్ స్థాయిని బట్టి లక్ష నుండి రెండు లక్షల మధ్యలోనే వసూలు చేస్తారని టాక్. ఇక చిన్న ఈవెంట్స్ అయితే ఇది కాస్త తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ పారితోషికాలు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే తప్ప వాళ్ళు ఎక్కడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదని గుర్తుపెట్టుకోవాలి.
ALSO READ :బతుకమ్మ పాటలంటే మంగ్లీ తర్వాతే ఎవరైనా.. మరోసారి నిరూపించిందిగా!