E-Paper
Advertisement

చిత్ర పరిశ్రమ అందరిదీ… ఒకరి సొత్తు కాదు.. విమర్శలకు చెక్ పెట్టిన చిరు!

చిత్ర పరిశ్రమ అందరిదీ… ఒకరి సొత్తు కాదు.. విమర్శలకు చెక్ పెట్టిన చిరు!
Advertisement

Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు చిరంజీవి(Chiranjeevi) ఒకరు గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకుంటూ నటుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో అనుభవం కలిగిన చిరంజీవి చిత్ర పరిశ్రమలో ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తూ నేనున్నా అనే భరోసా ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి పట్ల పలువురు విమర్శలు కురిపిస్తూ ఉంటారు.

ఇరుముడి విజయం పై చిరు ప్రశంసలు..

తన గురించి వస్తున్నటువంటి విమర్శలపై చిరంజీవి తాజాగా స్పందించారు. ఇటీవల రవితేజ హీరోగా నటించిన ఇరుముడి(Irumudi) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ సినిమా విజయం పట్ల స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని చిరంజీవి సైతం ఇరుముడి సినిమాపై స్పందిస్తూ చిత్ర బృందాన్ని అభినందించారు. సాధారణంగా ఏ సినిమా అయినా సక్సెస్ అయితే ముందుగా చిత్ర బృందాన్ని అభినందించే వారిలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఈ సినిమా విజయం పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

మనం నిలబడాలి.. ఇతరులను నిలబెట్టాలి..

Advertisement

ఇరుముడి సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ.. “సినిమా విజయం అనేది పరిశ్రమలో ప్రతి ఒక్కరికి ఒక సంబరం.. ఈ పరిశ్రమ అందరిదీ, కేవలం కొందరికి మాత్రమే కాదు. ఈ పరిశ్రమలో మనం నిలబడాలి అలాగే ఇతరులను కూడా నిలబెట్టాలి” అంటూ ఈయన పోస్ట్ చేశారు. చిరంజీవి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం చర్చలకు కారణమైంది. కొద్ది రోజులుగా చిరంజీవి గురించి వస్తున్నటువంటి విమర్శలపై ఈయన ఇలా పరోక్షంగా స్పందిస్తూ విమర్శలకు చెక్ పెట్టారని చెప్పాలి. ఇండస్ట్రీలో ఇతర ప్రతిభావంతులైన నటీనటులను చిత్ర నిర్మాతలను ఎదగకుండా చిరంజీవి తన పలుకుబడిని ఉపయోగిస్తూ అణిచివేస్తున్నారంటూ వస్తున్నటువంటి వార్తలకు కౌంటర్ ఇస్తూ ఈయన ఈ పోస్ట్ చేశారంటూ పలువురు భావిస్తున్నారు.

Advertisement

గత నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎంతో అనుభవం ఉన్న చిరంజీవి ఎంతోమంది నటీనటులను ప్రోత్సహిస్తూ వచ్చారు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇలా ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి చిరంజీవి గురించి వస్తున్నటువంటి వార్తలపై ఈయన స్పందించారని చెప్పాలి. ఒక సినిమా విజయం అయింది అంటే అది కేవలం హీరో ,దర్శకుడు లేదా నిర్మాతకు మాత్రమే ప్రయోజనం కలిగించదు. ఆ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూరుస్తుందని, అందుకే ఒక సినిమా విజయం అయితే చిత్ర పరిశ్రమ దానిని ఒక సంబరంలా జరుపుకోవాలని చిరు ఈ పోస్ట్ ద్వారా సందేశం ఇచ్చారని చెప్పాలి.

Also Read: ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబు.. గొప్ప అవకాశం అంటూ చిరు పోస్ట్!

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×