Crocodile Viral Video: సముద్రంలో జరిగే వింతలు తరచుగా ప్రపంచాన్ని అబ్బుర పరుస్తాయి. తాజాగా అలాంటి దృశ్యమే ఒకటి బయటకు వచ్చింది. ఎవర్ గ్లేడ్స్ లో ఒక అమెరికన్ మొసలి దాని మీద మరొక మొసలిని మోసుకెళ్తూ కనిపించింది. ఇందులో మొసలి వెల్లకిల పడి ఉండగా, దాని తోకను కింద ఉన్న మొసలి నోటిలో పట్టుకుని ముందుకు లాక్కెలుతూ కనిపించింది. మొసళ్లు కొట్టాడు కోవడంతో గాయాలు అయ్యాయా? లేదంటే మరేదైనా కారణంతో గాయపడిందా? అనేది తెలియదు. వాస్తవానికి అమెరికన్ మొసళ్ళు శక్తివంతమైన అపెక్స్ ప్రెడేటర్లు. చేపలను ఎక్కువగా తింటుంటాయి. అరుదైన సందర్భాల్లో ఇతర మొసళ్లతో పాటు ఇతర పెద్ద జంతువులను తింటాయి.
కీలక విషయాలు వెల్లడించిన మాల్కామ్ సీ
ఈ వీడియో ఓషియన్ నేషన్ అనే ఇన్ స్టా అకౌంట్ ద్వారా షేర్ చేయబడింది. ఇప్పటి వరకు ఈ వీడియో బోలెడు వ్యూస్ సాధించింది. పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోకు సముద్ర పరిశోధకుడు అయిన మాల్కామ్ సీ ఆసక్తికర కామెంట్ పెట్టాడు. “అద్భుతమైన దృశ్యాలు! నేను చనిపోయిన మొసలిని, బహుశా పెద్ద మొసలిని కూడా చాలాసార్లు చూశాను. ఎవర్ గ్లేడ్స్ లో పరిశోధన ప్రాజెక్ట్ కోసం అక్కడ ఉండేవాడిని. చనిపోయిన మొసలిని వారానికి 3-4 సార్లు చూశాను. గతంతో ఈ మొసలి కింది దవడకు గాయం అయ్యింది. అది ఇప్పుడు మానిపోయింది. ఈ ఫోటోలో దానిని క్లియర్ గా చూడవచ్చు. ఆ పెద్ద మొసలి అప్పుడప్పుడు కనిపించి. చనిపోయిన మొసలి, ఇప్పుడు దానిని మోసుకెళ్తున్న మొసలిని భయపెట్టేది. దాన్ని చూస్తేనే దూరంగా వెళ్లిపోయేది” అని చెప్పుకొచ్చాడు.
Read Also: ప్రపంచంలో పే…..ద్ద సినిమా, నెల రోజులు చూసినా అయిపోదట?
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
పెద్ద మొసలి వెళ్లిపోయిన తర్వాత, చిన్న మొసలి దాని సాధారణ స్థానానికి తిరిగి వెళుతుంది. పెద్ద మొసలి తిరిగి లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. చాలా ఏళ్లుగా చూస్తున్న మొసలి చనిపోవడం నమ్మలేకపోతున్నాను అని మాల్కామ్ సీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. గాయపడి, చావు బతుకుల్లో ఉన్న మొసలిని మోసుకెళ్తున్న మరో మొసలిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమెరికన్ మొసళ్లకు నిజంగా హ్యుమానిటీ ఎక్కువ అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: బాత్రూమ్ లోకి తొంగి చూసిన పులి.. ఆ తర్వాత..