Coolie:ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో.. రజనీకాంత్(Rajinikanth ) హీరోగా నటిస్తున్న చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారుగా రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ ఉండగా.. శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది. వీరితోపాటు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna ) ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్నారు. సౌబిన్ షాహిర్, సత్య రాజ్, ఉపేంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ఉండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా క్యామియో రోల్ పోషిస్తున్నారు. ఇక వీరితో పాటు ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) స్పెషల్ సాంగ్ చేయగా.. ఈమెకు పోటీగా సౌబిన్ షాహీర్ కూడా స్టెప్పులేస్తూ మరీ ఆకట్టుకున్నారు.
కూలీ సినిమా నటీనటుల రెమ్యూనరేషన్..
ఇకపోతే ఆగస్టు 14వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమాలో నటించిన స్టార్స్ కి ఎవరికి ఎంత పారితోషకం ఇచ్చారనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఈ సినిమా కోసం ఎవరు ఏ రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారు అనే విషయం ఎప్పుడు చూద్దాం..
ఆశ్చర్యపరుస్తున్న నటీనటులు రెమ్యూనరేషన్..
ఈ సినిమాకి ఆయువు పట్టు సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈయన రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ సరికొత్త రికార్డు సృష్టించారు. అటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూ.50 కోట్లు తీసుకుంటూ ఉండగా.. ఈ సినిమా మెయిన్ విలన్ నాగార్జున రూ.20 నుండి రూ.24 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అమీర్ ఖాన్ 15 నిమిషాల కోసం రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నా.. మరొకవైపు రజనీకాంత్ కోసం ఆయన ఈ సినిమాకి ఒక రూపాయి కూడా తీసుకోలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో అమీర్ ఖాన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? అసలు తీసుకున్నారా? లేదా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
వారికి కూడా భారీ రేంజ్ లో..
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ రూ.4కోట్లు తీసుకుంటూ ఉండగా.. స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి అదరగొట్టిన పూజా హెగ్డే (Pooja Hegde) సుమారుగా రూ.3కోట్లు తీసుకున్నట్లు సమాచారం .ఇక ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సత్యరాజ్ రూ.5కోట్లు, ఉపేంద్ర రూ. 5కోట్లు తీసుకుంటున్నారట. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన అనిరుద్ ఏకంగా రూ.15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ రికార్డు సృష్టించారు. ఇక మొత్తానికి అయితే నటీనటులకే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అంటే ఇక మిగతా మొత్తం సినిమా కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు టెక్నీషియన్స్ కి ఇతర నటీనటులకు కూడా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.
కూలీ కి పోటీగా వార్ 2..
ఇకపోతే ఈ చిత్రానికి పోటీగా హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్(NTR ) కాంబినేషన్లో వస్తున్న వార్ 2 చిత్రం కూడా రాబోతోంది. రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. ఇకపోతే వార్ 2 చిత్రంతో పోల్చుకుంటే కూలికి భారీ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు చిత్రాలలో ఏ చిత్రం సత్తా చాటుతుందో చూడాలి.
ALSO READ:Dhee: ఫ్యామిలీలు చూస్తున్నారు? ఏంటా డ్యాన్సులు.. ఇద్దరు అమ్మాయిలు అలా?