BigTV English

Rajinikanth: వచ్చి 50 ఏళ్ళు అయింది, క్రేజ్ చెక్కుచెదరలేదు 

Rajinikanth: వచ్చి 50 ఏళ్ళు అయింది, క్రేజ్ చెక్కుచెదరలేదు 

Rajinikanth: 1975లో కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు రజనీకాంత్. ఆ తర్వాత కొన్ని విలన్ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా సినిమా రజినీకాంత్ కు విపరీతమైన పేరు తీసుకొచ్చి పెట్టింది. ఇప్పటికీ రజనీకాంత్ అని చెప్పగానే మొదటి గుర్తొచ్చేది భాషా.


ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ దాదాపు 50 సంవత్సరాల పూర్తి చేసుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా చాలామంది ఎంట్రీ ఇస్తారు వెళ్లిపోతారు. కానీ 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడటం అంటే మామూలు విషయం కాదు. నేటికీ ఆ క్రేజ్ ఎలా ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపు రిలీజ్ అవుతున్న కూలీ సినిమా బుకింగ్స్ చూస్తుంటే ఒక్కొక్కరికి మతిపోతుంది. 50 సంవత్సరాలు కావస్తున్న అతని ఇమేజ్ చెక్కు చెదరలేదు అంటే ఏ రేంజ్ లో అభిమానులను సాధించుకున్నారు అర్థం అవుతుంది.

వచ్చి 50 ఏళ్ళు అయింది 


రజినీకాంత్ తన సినిమా జర్నీని 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తమ విషెస్ తెలియజేస్తున్నారు. కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి రజనీకాంత్ ఒక పిల్లర్ అంటూ ట్విట్టర్ వేదికగా కమలహాసన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలానే రేపు రిలీజ్ అవుతున్న కూలీ సినిమాకి కూడా విషెస్ చెప్పారు.

దర్శకుడు లోకేష్ ట్వీట్ రజనీకాంత్ గురించి ట్వీట్ వేశారు. కూలీ సినిమా నాకు ఎప్పటికీ స్పెషల్. నేను రజనీకాంత్ గారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో పనిచేయటం నాకు ఒక గొప్ప అవకాశం. కూలీ సినిమా గురించి మాట్లాడుతూ.. 50 సంవత్సరాలు రజినీకాంత్ ఇండస్ట్రీలో పూర్తిచేసుకున్న సందర్భంగా ట్వీట్ చేశాడు.

అలానే ఉదయనిది స్టాలిన్ కూడా కూలీ సినిమా గురించి చెబుతూ, రజనీకాంత్ జర్నీ గురించి మాట్లాడుతూ ఆయన కూడా అభినందనలు తెలియజేశారు.

భారీ లైనప్

రజనీకాంత్ దాదాపుగా 70 సంవత్సరాలు వయస్సు ఉన్నా కూడా ఇప్పటికీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. కూలీ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమా కూడా రానుంది. ఆ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వచ్చిన జైలర్ సినిమా బాక్సాఫస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. అలానే తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా రజినీకాంత్ తో సినిమా చేస్తాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

Also Read: Telugu film industry: ఫిలిం ఛాంబర్ లో మొదలైన మీటింగ్ , హాజరైంది వీళ్ళే

Related News

Anupama Parameswaran: ప్లీజ్‌ నా సినిమా చూడండి.. ప్రెస్‌మీట్‌లో ఏడ్చేసిన హీరోయిన్‌ అనుపమ

Coolie Vs War2 : రేపటి మొదటి ఆట టాక్ తో అసలు కథ స్టార్ట్ అవ్వబోతుంది 

Coolie: నాగార్జున కూలీ ఒప్పుకోవడం వెనక ఎంత పెద్ద కథ జరిగిందో?

Coolie: కూలీ మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Chiyaan 65: విక్రమ్ కొత్త మూవీ.. అన్నీ సెట్ అయితే త్వరలోనే సెట్స్ పైకి!

Tollywood: నిర్మాతలతో ఫెడరేషన్‌ భేటీ.. మళ్లీ విఫలమైన చర్చలు.. సమ్మె కొనసాగింపు తప్పదా?

Big Stories

×