Comedian Ali:ప్రముఖ సీనియర్ స్టార్ కమెడియన్ అలీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో నటిస్తూ బిజీగా మారారు..అలాంటి ఈయన ప్రతిభను మెచ్చి ఎన్నో అవార్డులు, రివార్డులు ఈయనను వరించిన విషయం తెలిసిందే . ఇక కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , టీవీ హోస్ట్ గా తన టాలెంట్ ను నిరూపించుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు అలీ.
సుమారుగా 1100కు పైగా సినిమాలలో నటించిన ఈయన.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ప్రతిభను గుర్తించిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ మరియు పర్వాజ్ మీడియా గ్రూప్ వారు 2026 సంవత్సరానికి గానూ బిగ్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అలీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన అవార్డు వేడుకలో తెలుగు నటుడైన ఆలీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రామదాస్ అథవాలే చేతుల మీదుగా ఈ ప్రెస్టేజియస్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందుకున్నారు.
ఈ ఏడాదికి గాను బెస్ట్ ఎంటర్ టైనర్ గా అబ్దుల్ కలాం అవార్డును అందుకున్న ఈయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.” ఈ అవార్డు నన్ను వరించడం పట్ల ఎంతో ఆనందం కలుగుతోంది. ఈ కార్యక్రమంలో సినిమా రంగానికే కాకుండా అనేక విభాగాల్లో పనిచేసిన నిపుణులకు అవార్డులను అందజేశారు. అవార్డుల కమిటీ వారికి , నన్ను అవార్డుకు సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు” అంటూ అని కామెంట్లు చేశారు.
also read:400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
అహమ్మద్ అలీగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే పలు చిత్రాలలో నటించి మరింత పేరు సొంతం చేసుకున్నారు. కామెడీ పండించడంలోనే కాదు ఎమోషనల్ గా మెప్పించడంలో కూడా ఈయన తర్వాతే ఎవరైనా.. అలా తెలుగు చిత్రాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా పనిచేసిన ఈయన సుమారుగా 1100 కు పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. ఇప్పటివరకు రెండు నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకున్నారు.
అలీ సినిమాలలోనే కాకుండా రాజకీయంగా కూడా అడుగులు వేసిన విషయం తెలిసిందే. 2019 మార్చి 11న వైఎస్ఆర్ సీపీలో చేరిన ఈయన.. 2022 అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు. ఇక 2024 జూన్ 28న రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఇక ఇప్పుడు అలీతో అల్లరి అనే షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. సినిమా సెలబ్రిటీలతో సందడి చేస్తూ ఎన్నో విషయాలను అభిమానులకు చేరవేస్తున్నారు. ఇక ఇదివరకే శ్రీ విష్ణు తో కామ్రేడ్ కళ్యాణ్ , ఇటు ఆనందితో గరివిడి లక్ష్మి సినిమా ప్రమోషన్ లలో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూలు చేసిన విషయం తెలిసిందే.