BSNL Recharge: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL) తన వినియోగదారుల కోసం మరో అత్యంత చౌకైన రూ. 202 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిళ్లలోనూ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సర్వీస్ కోరుకునే వాళ్లకు ఇది చక్కటి ఆప్షన్ అని బీఎస్ఎన్ఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
తక్కువగా ఫోన్ మాట్లాడేవారు, పెద్దగా డేటా అక్కర్లేని యూజర్లను టార్గెట్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ ఈ చౌకైన ప్లాన్ ను తీసుకొచ్చింది. 32 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 300 నిమిషాల టాక్ టైమ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే ప్లాన్ మెుత్తం కాలానికి 5 జీబీ హై-స్పీడ్ డేటాను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఒకవేళ కేటాయించిన డేటా అయిపోతే ఇంటర్నెట్ స్పీడ్ 40 Kbpsకి తగ్గిపోనుంది. దీంతో పాటు 100 ఎస్ఎంఎస్ లు, ప్రత్యేక బీమా సౌకర్యం యూజర్లకు లభించనుంది.
ఈ కొత్త వాయిస్ వోచర్ ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ‘బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్’ (BSNL Self Care) యాప్‌లోనూ అందుబాటులో ఉంది. ఆసక్తి గల వినియోగదారులు నేరుగా యాప్ లేదా వెబ్ సైట్ లోకి వెళ్లి ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read: గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!
రూ. 202 ప్లాన్ లో కంటే కాస్త ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే వారి కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 247 ధరకు మరో స్పెషల్ టారిఫ్ వోచర్ (STV) ను కూడా అందుబాటులో ఉంచింది. ఇది కొత్త ప్లాన్ కాకపోయినా చాలా కాలంగా వినియోగదారుల దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ లో 50 జీబీ హై-స్పీడ్ 4జీ డేటా యూజర్లు పొందొచ్చు. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాకుండా వినియోగదారుల మెయిన్ అకౌంట్లో అదనంగా రూ. 10 విలువైన టాక్ వాల్యూ కూడా జమ అవుతుంది.
Also Read: భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!