Rashmika Mandanna:ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna) వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ క్వీన్ గా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు తన గొప్ప మనసును చాటుకుంది. ఈ మేరకు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన వీడియో అభిమానులను, సినీ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రష్మిక ఒక గొప్ప ప్రయత్నం చేసింది అంటూ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రష్మిక తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.” మీరు పోషించే పాత్రలలో మిమ్మల్ని ప్రభావితం చేసే అంశాలు కూడా కొన్ని ఉంటాయి. మీలో చాలామంది జయమ్మకు, నాకు మధ్య ఏదైనా పోలికలు ఉన్నాయా ? అని అడుగుతూ ఉంటారు. దానికి నా సమాధానం అవును అనే చెబుతున్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ప్రతిఫలంగా నేను ఎప్పుడూ ఇలాంటివి చేస్తూనే ఉంటాను. కానీ ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయం నాకు, నా బృందానికి, మాలో కొందరికి తెలిస్తే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను దీని గురించి బయట పెట్టడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నావల్ల మీలాంటి ప్రియమైన వారు కూడా ఇలాంటివి ఏమైనా చేయడానికి ప్రేరణ పొందితే ..నాకు మరింత ఆనందం ..అందుకే ఇప్పుడే ఎందుకు ప్రారంభించకూడదు అని ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను.
నేను ఈరోజు 400 కుటుంబాలను దత్తత తీసుకున్నాను. అయితే ఒకేసారి 400 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడు నెలల పాటు సహాయం చేయాలనుకుంటున్నాను. దీనిని వచ్చే ఏడాది పాటు కొనసాగించి , వారు ఆ డబ్బును నిత్యవసరాల కోసం ఆదా చేసి, దానిని తమ భవిష్యత్తును మెరుగ్గా ప్రణాళిక చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఒక చిన్న సహాయం ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలదు. అది పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. మనందరం ఏదో ఒక చిన్న విషయంతో ప్రారంభిద్దాం.. నన్ను నమ్మండి.. నాతో కొన్నేళ్లుగా నేను పడిన నిద్రలేని రాత్రులు, గాయాలు, కష్టాలు, నొప్పి, కన్నీళ్లు అన్నింటికి ఈ చిరునవ్వులే ప్రతిఫలం.. ఇది వెలకట్టలేనిది ” అంటూ తన అభిప్రాయంగా చెప్పకు వచ్చింది
also read:ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!
ఇకపోతే ఈమె అందిస్తున్న నిత్యావసర సరుకులలో బియ్యం 75 కేజీలు, గోధుమపిండి 10 కేజీలు, రాగి పిండి మూడు కేజీలు, వంటనూనె 10 లీటర్లు, పప్పు 15 కేజీలు, సోయా చంక్స్ 2 కేజీలు, ఉప్పు 3కేజీలు, చక్కెర 3 కేజీలు , కారంపొడి ఒక కేజీ , పసుపు అర్ధ కేజీ , చింతపండు అర్థ కేజీ , టీ పౌడర్ అర్థ కేజీ చొప్పున అందజేస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాదు, మహబూబ్నగర్ , అనంతపూర్, బెంగళూర్, కొచ్చి , చెన్నై, కొడగు, విజయవాడ వంటి ప్రాంతాలలో ఎంపిక చేసిన 400 కుటుంబాలకు ఈ నిత్యవసర సరుకులు అందించనున్నారు.