Comedian Ramachandra: ప్రముఖ కమెడియన్ రామచంద్ర (Comedian Ramachandra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈయన.. ఇప్పటివరకు సుమారుగా 150కి పైగా చిత్రాలలో నటించినట్లు సమాచారం. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ (Raviteja).హీరోగా నటించిన ‘వెంకీ’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్నారు.. ఇందులో రవితేజ స్నేహితుడిగా అద్భుతమైన కామెడీ డైలాగ్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.. ఈ సినిమాతోనే ఊహించని ఇమేజ్ అందుకున్న ఈయన.. గత 15 రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
పెరాలసిస్ బారిన పడ్డ కమెడియన్ రామచంద్ర..
ఇటీవల తన ఫ్రెండ్ కోసం ఒక చిన్న షూట్ కోసం వెళ్లగా.. అక్కడ అనుకోకుండా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చారట. వెంటనే ఎడమ చేయి, ఎడమ కాలు పనిచేయడం ఆగిపోయాయి. దీంతో పక్షవాతం బారిన పడ్డారు.. వెంటనే ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించి స్కానింగ్ తీయించగా.. బ్రెయిన్ లో క్లాట్ ఉందని.. రెండు మూడు ప్రదేశాలలో బ్లడ్ క్లాట్ ఏర్పడిందని.. ఇది పోతే పక్షవాతం పోతుంది అని సలహా ఇచ్చారట. దాదాపు రెండు నెలల పాటు చికిత్స తీసుకోవాలని సూచించగా.. ఆయన హోమియోపతి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు..
ఇదిలా ఉండగా.. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు కూడా తెలిపారు కమెడియన్ రామచంద్ర. ప్రస్తుతం మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కదా.. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందించారా?.. ముఖ్యంగా రవితేజ లాంటి వారు మీకు సహాయం చేశారా? అని ప్రశ్నించగా.. ఎవరూ ఊహించని సమాధానం తెలియజేశారు రామచంద్ర. ఆయన మాట్లాడుతూ..” ఇప్పటివరకు నా కుటుంబ సభ్యులు.. మా అన్నయ్య, వదినతో పాటు చాలామంది నాకు అండగా నిలిచారు.. ఇండస్ట్రీలో నాకు తెలిసిన కొంతమంది స్నేహితులకు మాత్రమే ఈ విషయం చెప్పాను. ప్రస్తుతం వారంతా కూడా ఫోన్లు చేసి నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. అంటూ తెలిపారు.
రవితేజను హెల్ప్ అడిగితే..
రవితేజని మీరు ఏదైనా సహాయం అడిగారా? అని అడగగా.. రవితేజ గారు అంటారా.. ఆయన వరకు అసలు ఈ విషయం వెళ్తుందా? వెళ్తే కదా నా పరిస్థితి ఆయనకు తెలిసేది.. ముందు నా పరిస్థితి గురించి ఆయన వరకు వెళ్ళనివ్వండి.. వెళ్ళినప్పుడు చూద్దాము” అంటూ రవితేజను సహాయం అడగడంపై ఊహించని కామెంట్లు చేశారు రామచంద్ర. ప్రస్తుతం కమెడియన్ రామచంద్ర చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక రామచంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి రవితేజకు తెలియాలి అని.. ఆయన వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేయాలి అని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ విషయం రవితేజ వరకు వెళ్లేలా పలు మీడియా ఛానల్స్ కూడా ఈ వార్తను స్ప్రెడ్ చేయాలని అభిమానులు కోరుకుంటూ ఉండడం గమనార్హం.
మళ్లీ సినిమాలలో చేస్తాను – రామచంద్ర
ఇకపోతే త్వరగా తాను కోలుకుంటానని.. మళ్లీ సినిమాలలో నటిస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈయన నడవలేని పరిస్థితుల్లో ఉండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ అభిమానులకు ఆయన ధైర్యాన్ని ఇస్తూ త్వరలోనే తాను మళ్ళీ కం బ్యాక్ అవుతానని చెప్పడం ఇక్కడ ప్రశంసనీయమని చెప్పాలి. ఈ ధైర్యమే ఆయనను మళ్ళీ మామూలు మనిషిని చేస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ : HBD Chiranjeevi: ఊరికే మెగాస్టార్ అయిపోయారు.. ఆ బిరుదు వెనుక ఎంత కష్టం ఉందంటే?