Comedian Sathyan:ఈ మధ్యకాలంలో చాలామంది ఒక్క పాత్రలో చేసినా.. అది చిరస్థాయిగా మిగిలిపోవాలనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఒకే పాత్రతో ప్రేక్షకులను అలరించి చెరగని ముద్ర వేసుకున్న నటీనటులు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో తమిళ యాక్టర్ సత్యన్ కూడా ఒకరు . ఈయన పేరు చెబితే వెంటనే గుర్తుపట్టరు కానీ ముఖం చూస్తే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈయన తెలుగులో స్నేహితుడు ( తమిళంలో నంబన్) సినిమాలో సైలెన్సర్ గా నటించిన ఆకట్టుకున్నారు. క్లాస్ ఫస్ట్ వచ్చేయాలని తెగ కష్టపడే ఇతడిని.. హీరో, అతడి బృందం ముప్పుతిప్పలు పెడుతూ ఉంటారు. ఈ సన్నివేశాలు అన్నీ కూడా చూసే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. సబ్జెక్టు కాదు క్లాస్ ఫస్ట్ మాత్రమే రావాలి అనే తపన పడే స్టూడెంట్ క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించారు సత్యన్.
అలాంటి ఈయన అత్యాశకు పోయి 500 ఎకరాల భూమిని కర్పూరంలా కరిగించారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఈయన ఎవరో కాదు ప్రముఖ నిర్మాత మదంపట్టి శివకుమార్ ఏకైక కుమారుడు. సత్యరాజుకు దగ్గర బంధువు కూడా.. శివకుమార్ కు 500 ఎకరాల పొలంతో పాటు ఐదు ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద బంగ్లా కూడా ఉండేదట. ఎంతో విలాసవంతమైన జీవితం వీరి సొంతం. అయితే కొన్ని కొన్ని సార్లు సినీ సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించే అంత కలర్ ఫుల్ గా లోపల ఉండవు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రపంచం ఆయన ఆస్తిని కర్పూరంలా కరిగించింది. శివకుమార్ నిర్మాతగా మారడంతోనే అసలు కష్టాలు మొదలయ్యాయి. అసలు విషయంలోకి వెళ్తే.. సత్యన్ తండ్రి నిర్మాతగా మారిన తర్వాతనే అసలు కష్టాలు మొదలయ్యాయి. చిత్రాలకు భారీ బడ్జెట్ కేటాయించడంతో అవి రిలీజ్ అయ్యాక డిజాస్టర్లుగా మారి భారీ నష్టాలను అందించాయి. దాన్నుంచి గట్టెక్కే క్రమంలో ఆస్తులు కూడా అమ్ముకున్నారు.
వర్కౌట్ కాక కమెడియన్ గా సెటిల్..
అయితే వీటన్నింటికీ కారణం శివకుమార్ కొడుకు కమెడియన్ సత్యన్ అనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి హీరో అవుదామని అడుగు పెట్టాడు. 2000 సంవత్సరంలో ఇలయవన్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దీనికి తన తండ్రి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినా సరే కొడుకును హీరోగా నిలబెట్టడానికి మరో సినిమా చేశారు. అది కూడా ఘోర పరాభవం చవి చూసింది. అలా వరుసగా రెండు సినిమాలు ప్లాపులు కావడంతో ఆర్థికంగా ఆ కుటుంబం మరింత చితికిపోయింది. ఆస్తులను కూడా కోల్పోయి ఆఖరికి ఉన్న బంగ్లాను కూడా అమ్ముకోక తప్పలేదట. అలా హీరోగా వర్క్ అవుట్ కాకపోయేసరికి కమెడియన్ గా మారి 70 కి పైగా చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు సత్యన్.
ALSO READ:Ashish Kapoor Arrested: దారుణం..ఇంటికి పిలిపించి మరీ అమ్మాయిపై దాడి చేసిన హీరో.. అరెస్ట్!