Ashish Kapoor Arrested: ఈ మధ్య ఇండస్ట్రీలో ఏదో ఒక విషయంపై చాలామంది సెలబ్రిటీలు జైలు పాలవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ ప్రముఖ టీవీ నటుడు ఆశిష్ కపూర్ ను పోలీసుల అరెస్టు చేశారు. బాధితురాలు తెలిపిన ప్రకారం ఆశిష్.. తన ఇంట్లో నిర్వహించినటువంటి ఒక ప్రైవేట్ పార్టీకి తనని ఆహ్వానించారని, ఆ సమయంలోనే బాత్రూమ్ లో తనపై అత్యాచారం చేశారని ఆ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అత్యాచార ఘటనలో కేస్ నమోదు కావడంతో పోలీసులు నటుడిని అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నటుడు ఆశిష్ కపూర్ , బాధితురాలు ఇంస్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారట.. ఈ పరిచయం కాస్త కొద్ది రోజులలోనే స్నేహంగా మారింది. అదే క్రమంలోనే ఆశిష్ ఆ అమ్మాయిని.. తన ఇంట్లో జరిగే ప్రైవేట్ పార్టీకి ఆహ్వానించారు. నటుడు పిలుపుమేరకు ఆ ఇంటికి వెళ్లిన సదరు బాధితురాలిపై బాత్రూంలో నటుడు ఆశిష్ కపూర్ అత్యాచారానికి పాల్పడ్డారట.. అందుకు సంబంధించిన వీడియోను కూడా షూట్ చేశామని , పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ వీడియో సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బెదిరించారు అంటూ బాధితురాలు పోలీసుల ముందు తన గోడు వెళ్ళబోసుకుంది. అయితే ఫిర్యాదులో భాగంగా ఇంకా ఎలాంటి వీడియో కనుక్కోలేదంటూ తెలుపుతున్నారు పోలీసులు.
హీరో తోపాటు ఆయన స్నేహితులు కూడా అరెస్ట్..
ఈ కేసులో నటుడు ఆశిష్ తో పాటు, అతడి స్నేహితుడు, అతని స్నేహితుడు భార్య, మరో ఇద్దరి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఆశిష్ ఇచ్చిన పార్టీలో డ్రింక్ లో ఏదో కలిపారని బాధితురాలు ఆరోపించింది. పైగా ఈ సంఘటన గురించి బయటికి చెబితే.. చంపేస్తానంటూ ఆశిష్ బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. ప్రస్తుతం పోలీసులు ఆశిష్ కపూర్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం మరి దీనిపై ఆశిష్ కపూర్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
ఆశిష్ కపూర్ నటించిన సీరియల్స్..
40 ఏళ్ల వయసున్న ఆశిష్ కపూర్.. ఫిర్ కోయి హై, సౌత్ ఫెరే, సలోని కా సఫార్, మోల్కి, అగ్ని పరీక్ష వంటి సీరియల్స్ లలో నటించారు. ఈయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఒక సీరియల్ లో నటించే సమయంలో ప్రీయల్ గోర్ అనే నటితో ప్రేమాయణం నడిపారు .ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడిపోయారు..దీని తర్వాత ప్రముఖ నిర్మాత పెర్లు గ్రే తో 2021 లో ఎంగేజ్మెంట్ చేసుకోని విడిపోయారు. ఇప్పుడు మళ్లీ అత్యాచార ఆరోపణలతో ఆశిష్ పేరు వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా ఆశిష్ రెండుసార్లు ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసి ఇప్పుడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ALSO READ:Tollywood: బడా చిత్రాలకు దేవుడే అడ్డమా.. ఇదెక్కడి విడ్డూరం!