Manchu Manoj: మహానటి సినిమాలో ప్రతిభ ఇంటిపట్టున ఉంటే ప్రపంచానికి పుట్టగతులు ఉండవు అని ఒక డైలాగ్ ఉంటుంది. అది నిజమే అని కొందరి నటుల విషయంలో అనిపిస్తుంది. తమ నటనతో ప్రేక్షకులను అలరించేవారు సడెన్ గా నటన మానేస్తే.. ఎన్నో మంచి మంచి పాత్రలు వారిని మిస్ అవుతాయి. మంచు వారసుడు మంచు మనోజ్ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇలానే బాధపడ్డారట.
మంచు కుటుంబం నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరో మంచు మనోజ్. మంచి మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మనోజ్. ఇక కెరీర్ లో ఎత్తుపల్లాలు కామన్. వాటిని చూసీచూడనట్లు వెళ్ళిపోతేనే ఎవరైనా సక్సెస్ ను అందుకోగలరు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మనోజ్ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. పర్సనల్సమస్యల వలన మనోజ్.. సినిమాలు చేయలేదు.
ఇక ప్రస్తుతం మనోజ్ తన రీఎంట్రీని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా హీరోగా, విలన్ గా చేస్తూ సక్సెస్ కు దారిని వెతుకుతున్నాడు. ఈ నేపథ్యంలోనే భైరవం సినిమాతో తొలి అడుగు వేశాడు ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా మనోజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తండ్రి మోహన్ బాబు నటనను మొత్తం రంగరించి మరీ మనోజ్ లో కుమ్మరించినట్లు అనిపించిందని చాలామంది ప్రేక్షకులు చెప్పుకొచ్చారు.
ఇక ప్రస్తుతం మంచు మనోజ్.. మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ లో మనోజ్ లుక్ కి, విలనిజానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరఅపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మనోజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో రజినీకాంత్ తనకు క్లాస్ పీకారని చెప్పుకొచ్చాడు.
మంచు కుటుంబానికి.. రజినీకాంత్ అత్యంత దగ్గర సన్నిహితుడు. చిన్నతనం నుంచి మనోజ్, విష్ణు, లక్ష్మీ.. రజినీ కుటుంబంలోని పిల్లలుగానే పెరిగారు. అందుకే వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు. మొన్ననే మనోజ్.. రజినీని కలిసి మిరాయ్ ట్రైలర్ చూపించాడు. ఆ ఘటన గురించి మాట్లాడుతూ.. ” కూలీ రిలీజ్ కు వారం ముందే నేను రజినీని కలిసాను. మిరాయ్ ట్రైలర్ చూసి నన్ను మెచ్చుకున్నారు. ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయమని ఆశీర్వదించారు. ఇక సినిమాలకు గ్యాప్ ఇవ్వొద్దని చెప్పారు. ఇప్పుడు కాదు గతంలో నేను సినిమాలు చేయకుండా ఉన్నప్పుడు ఆయన నాకు గట్టిగానే క్లాస్ పీకారు. సినిమాలు చేయకుండా ఏం చేస్తున్నావ్ అంటూ అరిచారు. నేను చేస్తానని చెప్పాను” అని మనోజ్ చెప్పుకొచ్చాడు.
నిజం చెప్పాలంటే రజినీ..మనోజ్ కు క్లాస్ పీకడంలో ఎలాంటి తప్పు లేదు. మనోజ్ మంచి నటుడు. వాక్చాతుర్యం, గాంభీర్యం కలసిన ముఖం. విలన్ గా అయినా, హీరోగా అయినా మంచి కథలు ఎంచుకుంటే.. మనోజ్ కు తిరుగుండదు. మిరాయ్ హిట్ అయితే.. విలన్ గా సెట్ అయ్యిన్నట్లే. మరి ఈ సినిమాతో మనోజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.