BigTV English

Tirupati TDP: తిరుపతిలో టీడీపీకి దిక్కెవరు?

Tirupati TDP: తిరుపతిలో టీడీపీకి దిక్కెవరు?

Tirupati TDP: తిరుపతి నియోజకవర్గంలో అడుగడుగునా అధికార పార్టీలో నాయకత్వ లోపం కనిపిస్తుంది. దాంతో ప్రత్యర్థులు ఇష్టాను సారం వ్యవహారిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాది కాలంగా వైసీపీ చోటోమోటా నేతలతో కూటమి చోటా నేతలు కలసి కట్టుగా కలసి దందాలు చేస్తున్నారంటే అక్కడ నాయకత్వ లోపం కనిపిస్తోందంటున్నారు. తాజాగా వైసీపీకి చెందిన చైతన్య యాదవ్, అజయ్ రెడ్డి దందాలే అందుకు నిదర్శనం అంటున్నారు. అసలింతకీ తిరుపతిలో ఏంజరుగుతుంది? టీడీపీ అధిష్టానం ఇంకా అక్కడ పార్టీకి ఎందుకని రిపేర్లు చేయడం లేదు?


తొలిసార తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచిన ఎన్టీఆర్

రాష్టంలో అత్యంత కీలక మై న నియోజకవర్గం తిరుపతి. టీడీపీ ఆవిర్బావం తర్వాత నందమూరి తారక రామారావు తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచి ఆ స్థానానికి సెంటిమెంట్ వాల్యూ పెంచారు.తర్వాత ప్రజా రాజ్యంలో సైతం మెగా స్టార్ చిరంజీవి ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించి రాజకీయ అరంగ్రేటం చేసారు. అయితే స్థానికంగా ఉన్న నాయకత్వ లేమి, గ్రూపు విభేదాలతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేయడానికి వెనుకాడారన్న అభిప్రాయం ఉంది. గత ఎన్నికల సమమయంలో టీడీపీలో తిరుపతి సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.


గ్రూప్‌వార్ తట్టుకోలేక జనసేనకు టికెట్ కేటాయించిన చంద్రబాబు

తిరుపతి నేతల గ్రూపు వార్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఆ సీటు జనసేనకు కేటాయించారు. జనసేన లో సైతం పాతకాపులు కాకుండా చిత్తూరు నుంచి వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు టికెట్ దక్కించుకుని తిరుపతిలో ఇప్పటి వరకు ఎవరూ సాధించని మెజార్టీతో గెలుపొందారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూటమిలో ముఖ్యంగా టీడీపీ నాయకత్వంలో మార్పు రాలేదు. అధికారంలో ఉన్నమనే దర్పం కనిపించడం లేదు. ఇన్చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరి కార్పోరేషన్ చైర్మన్ అయ్యారు. అమెను తెలుగు తమ్ముళ్లు అసలు పట్టించుకోవడమే లేదంట.

తిరుపతికి నాలుగు నామినేటెడ్ పదవులు ఇచ్చిన టీడీపీ

మరో వైపు తిరుపతి నగరానికి సంబంధించి రాష్ట స్థాయి కార్పొరేషన్ పదవులు నాలుగు దక్కాయి. శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహా యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, గ్రీనరి అండ్ బ్యూటిపికేషన్ చైర్మన్‌గా సుగుణమ్మలకు టీడీపీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఇక డైరెక్టర్ లుకా అనేక మంది కి అవకాశం కల్పించారు. వారిలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా విజయ్‌కూమార్ కు అవకాశం కల్పించారు.

యాక్టివ్‌ రాజకీయాల్లో కనిపించని తిరుపతి టీడీపీ నేతలు

గత ఎన్నికల్లో తిరుపతి టీడీపీ టికెట్ అశించిన వారిలో జేబీ శ్రీనివాస్, మబ్బు దేవ నారాయణరెడ్డి , డాక్టర కొడూరి బాలు ఉన్నారు. వీరితో పాటు హాడావుడి నాయకులు తిరుపతి టీడీపీలో చాలా మందే ఉన్నారు. అయితే ప్రస్తుతం వారిలో యాక్టివ్ రాజకీయాలు ఎవ్వరు చేయడంలేదు. క్షేత్ర స్థాయి కార్యకర్తల సమస్యలు తెలుసుకునేవారే కరువయ్యారు. గ్రూపుల గోల కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో నామినేటెడ్ పదవి దక్కించుకున్న సుగుణమ్మను పార్టీ తిరుపతి ఇన్చార్జ్‌గా మార్చి త్రీ మెన్ కమిటి వస్తుందని తెలుగు తమ్ముళ్లు అశిస్తున్నారు. కాని పార్టీ అధిష్టానం ఇవేమి పట్టించేకోవడం లేదంట. దీంతో పార్టీ క్యాడర్ నిరాశ నిసృహాల్లోకి వెళుతుంది..

కార్పొరేషన్ ఎన్నికలకు క్యాడర్‌ను సిద్దం చేస్తున్న వైసీపీ

టీడీపీలో పరిస్థితిని ఆసరా చేసుకుని తిరుపతిలో వైసీపీ దూకుడు పెంచి వచ్చే నగర పాలక సంస్థ ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేస్తుంది. తిరుపతి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అయన కూమారుడు తిరుపతి ఇన్చార్జ్ అభినయ్ రెడ్డిలు తెలుగుతమ్ముళ్లపై మైండ్ గేమ్ మొదలు పెట్టారంటున్నారు. తమ అనుచరుల వ్యాపారాలలో కొంతమంది టిడిపి వారికి వాటా కల్పించి సమస్యలు లేకుండా సెట్ రైట్ చేసుకుంటున్నారంట. దానికితోడు తమ వారిని కొంతమందిని జనసేనలోకి పంపించారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని స్థాయిలో వైసీపీ నేతలు ప్రభుత్వంపై దాడి ప్రారంభించారు. దీంతో పాటు టీటీడీ అధికారులు, పాలక మండలిపై వారు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. గోశాల ఇష్యూ రాష్ట వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో తిరుపతి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన భూమన అభినయ్‌రెడ్డి కూడా వాగ్ధానాల అమలు కావడం లేదంటూ హాడావుడి చేస్తున్నారు. అయితే టిడిపి నేతలు మాత్రం ఇందంతా పోలీసులు వైఫల్యం అంటు పార్టీ ప్రధాన కార్యాలయానికి పోటోలు పంపడం తప్ప ఎదురు దాడి చేయడం లేదు.

కారు డెకార్స్ యాజమానిపై చైతన్యయాదవ్ దాడి

రెండు నెలల క్రితం అభినయ్ రెడ్డి అనుచరుడు అయిన చైతన్య యాదవ్ ఓ కారు డెకార్స్ యాజమానిపై దాడి చేసాడు. ఆ కేసులో హైకోర్డు ద్వారా ఉరట పొందాడు. అయితే పోలీసులు సీరియస్ గా వ్యవహారించి అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేసారు. తాజాగా భూమన అనుచరుడు , వైసిపి సోషల్ మీడియా ఇన్చార్జ్ అనిల్ రెడ్డి వ్యవహారం పెద్ద కలకలమే రేపింది. పవన్ అనే ఎస్పీ యువకుడిని తన కార్యాలయంలో బంధించి, కొట్టించి తర్వాత వారి తల్లితండ్రులతో బేర సారాలు అడి వదిలేశారు. అయితే సదరు దాడి వీడియో బయటక వచ్చిన వెంటనే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. రాత్రికి రాత్రే అనిల్ రెడ్డితో పాటు జగదీష్ రెడ్డి అనే వ్యక్తిని ఏకంగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. దళిత యువకుడిపై దాడి చేసిన నిందితులు దినేష్, అజయ్ కూమార్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దానిపైన హోంమంత్రి అనితతో పాటు ఇన్చార్జ్ మంత్రి సత్యకూమార్, శాప్ చైర్మన్ రవినాయుడు స్పందించిన తర్వాత అప్పుడు తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు నరసింహయాదవ్ స్పందించారు. అయితే తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ సుగుణమ్మ కాని ఇతర నాయకులు ఎవ్వరు మాట్లాడటం లేదు. వైసిపి సోషల్ మీడియా మాత్రము నిందితుడు దినేష్ జనసేన కార్యకర్త అంటుంటే సాయంత్రానికి తీరిగ్గా జనసేన నేతలు స్పందించారు. అయితే ఈ ఇష్యూలో తిరుపతి టీడీపీ నేతలు సమర్ధంగా ఎదురు దాడి చేయలేదనే విమర్శలు ఉన్నాయి..

Also Read: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా? ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం..

ఎందుకు పనిచేయాలి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శలు

ఈ వ్యవహారంలో తిరుపతి టీడీపీలోని లుకలుకలు బయటపడ్డట్లైంది. మేమెందుకు పనిచేయాలి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా త్రీ మెన్ కమిటి కోసం ఎదురు చూస్తుండంటంతో పాటు తుడా చైర్మన్ పదవి అశించినప్పటికి రాకపోవడంతో వారు పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం మానేశారంటున్నారు. మరో వైపు పోలీసులే అంతా చూసుకోవాలి అన్నట్లు స్థానిక నేతలు వ్యవహారిస్తుండటంతో అది పోలీసులకు తలనొప్పిగా మారింది. మీడియా ఫోకస్ ఉంటే సెంటర్ కావడంతో ప్రతి ఒక్కరి దృష్టి తిరుపతి పై కేంద్రీకృతం కావడంతో ఇదేం తలనొప్పి అని పోలీసులు భావిస్తున్నారంట. మొత్తం మీద తిరుపతిలో టీడీపీ ముఖ్య నేతలు ఇన్ యాక్టివ్ కావడంతో పాటు, చోటా నేతలు వైసీపీ వారితో కలసి చెట్టపట్టాలు వేసుకుని వ్యాపారాలలో బాగస్వాములు కావడంతో క్యాడర్ అసలు ఇందుకోసమా మేము కష్ట పడిందని తెగ మధనపడిపోతున్నారంట. ఈనేపధ్యంలో తిరుపతికి ఓ బలమైన నాయకుడిని ఇవ్వండి అని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. చూడాలి పార్టీ అధిష్టానం తిరుపతి పై ఎప్పుడూ దృష్టి సారిస్తుందో.

Story By Rami Reddy, Bigtv

Related News

India-China Thaw: భారత్‌‌‌‌తో చైనా దోస్తీకి సై.. రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది?

Giddalur Politics: గిద్దలూరు వైసీపీలో అయోమయం.. నాగార్జున ఫ్యూచర్ ఏంటి?

Pakistan Army: పాక్ పరేషాన్ ఫోర్స్..! చైనా సపోర్ట్‌‌తో మునీర్ కొత్త ప్లాన్..?

Congress: భయపెడుతున్నాడా! పార్టీ మారుతాడా! రాజగోపాల్ లెక్కేంటి?

AP Politics: బిగ్‌బాస్ జగనే! బీజేపీ దూకుడుకు రీజనేంటి?

Big Stories

×