Workers Union Stops Pawan Kalyan Movie Shooting: టాలీవుడ్లో ప్రస్తుత పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. వినోద పరిశ్రమ రోజురోజుకు వివాదస్పదంగా మారుతోంది. నిన్నటి వరకు ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య రభస జరుగుతోంది. కార్మికుల వేతనాలను పెంచాలనే డిమాండ్ ని ఫిలిం ఛాంబర్ తొసిపుచ్చుతోంది. వేతనాలు పెంచేదే లేదనడంతో కార్మికులంత సమ్మెకు సైరన్ మోగించారు. షూటింగ్ లో పాల్గొనకుండ నిరసన తెలుపుతున్నారు. దీంతో మీడియం, చిన్న సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి. అయితే పెద్ద హీరో, బడా నిర్మాణ సంస్థల్లో రూపొందుతున్న సినిమాల షూటింగ్స్ మాత్రం యాదావిధిగా కొనసాగుతున్నారు.
పవన్ సినిమాకు సమ్మె సెగ
తెలుగు సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో ముంబై నుంచి కార్మికులను రప్పించారట. దీంతో ఆగ్రహానికి గురైన కార్మికులు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ని అడ్డుకున్నట్టు తెలుస్తోంది. కాగా పవన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో పలువురు స్టార్స్ నటిస్తున్నారు. వారంత సీరియన్స్ కావడంతో మళ్లీ డేట్స్ ప్రాబ్లమ్ రాకుండ మైత్రీ మేకర్స్ షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇందుకోసం ముంబై నుంచి కార్మికులను రప్పించి మరీ ఉస్తాద్ షూటింగ్ జరుపుతున్నారు. ఇది తెలిసి తెలుగు సినీ కార్మికులు మూవీ టీంపై భగ్గుమన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ కి వెళ్లి షూటింగ్ని అడ్డుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: Jr NTR: బాలీవుడ్ అయిపోయింది.. ఇక శాండల్ వుడ్ టైం.. కాంతార 3లో ఎన్టీఆర్!
కాగా కొంతకాలంగా తమకు సరైన వేతనాలు లేవని, తమకు 30 శాతం వేతనాలు పెంచాలని ఫిలిం ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ ని కోరింది. అయితే నిర్మాతలు ఇప్పటికే మీకు మంచి వేతనాలు ఇస్తున్నామని, పెంచేది లేదని చెప్పడంలో ఫిలిం ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. వేతనాల విషయంలో కొద్ది రోజులుగా తెలుగు కార్మిక సంఘం ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ మధ్య తరచూ వివాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కార్మిక సంఘం ఫెడరేషన్ వారికి ప్రతి ఏడాది జీతాలు పెంచకపోయిన ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచాలని నిర్ణయించారు.
ఛాంబర్ దిగి వచ్చేనా
ఇప్పటికే మూడు సంవత్సరాలు దాటిపోయిన తమ జీతాలు పెంపుదలపై ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ఇప్పటికే వేతనాల విషయమైన ఫిలిం ఫేడరేషన్..ఛాంబర్ తో పలుమార్లు చర్చలు జరిపింది. లాభం లేకపోవడంతో సినీ కార్మికులు బంద్కు పిలుపునిచ్చాయి. తమ వేతనాలు పెరిగే వరకు షూటింగ్ లో పాల్గొనమంటూ నిరసన దిగారు. ఇక పలువురు అగ్ర హీరో సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో సినీ కార్మికులు సమ్మెకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నిర్మాతలు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరి ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ దిగివస్తుందా? కార్మికుల డిమాండ్ మేరకు వేతనాలు పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.