Narsingh News: ఇటీవలి కాలంలో భార్యల చేతుల్లో భర్తల హత్యలు.. భర్తల చేతుల్లో భార్యలు హత్యలకు గురి కావడం భారతదేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనలు వివాహేతర సంబంధాలు, గృహ హింస, అనుమానాలు, ఆర్థిక వివాదాల వంటి కారణాలతో ఎక్కువ జరుగుతున్నాయి.. ఇటీవల జరిగిన మేఘాలయ హనీమూన్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటన చూసి చాలా మంది భయబ్రాంతులకు గురయ్యారు. అలాగే గద్వాల జిల్లాలో ప్రియుడితో కలిసి తేజేశ్వర్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ఇలా తరుచూ దేశంలో ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కేసులు సమాజంలోని వివాహ సంబంధాలలో పెరుగుతున్న ఒత్తిడులు, అనుమానాలు, నమ్మక లేనితనాన్ని తెలియజేస్తున్నాయి. పోలీసులు నిందితులను గుర్తించి కఠినమైన శిక్షలు వేస్తున్నప్పటికీ సమాజంలో ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా ప్రియురాలితో కలిసి ఉంటున్న భర్తను దేహశుద్ధి చేసిన భార్య ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
ALSO READ: Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!
హైదరాబాద్, నార్సింగ్ పరిధిలో పరిధి గంధ గూడకు చెందిన వేణుకుమార్ గత కొన్నేళ్ల వివాహం అయ్యింది. అయితే.. వేణు కుమార్ కొన్ని రోజుల నుంచి ప్రియురాలు మౌనికతో నివాసం ఉంటున్నారు. అతను ఇంటి సభ్యులతో సమయం గడపకపోవడంతో తన భార్యకు అనుమానం వచ్చింది. పక్కా ప్లాన్ తో ఇద్దరు కలిసి ఉంటున్న ఇంటికి వేణు కుమార్ భార్య బంధువులతో కలిసి చేరుకుంది. దీంతో వేణుకుమార్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇద్దరికి దేహశుద్ధి చేసి నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. తనకు న్యాయం చేయాలని వేణు కుమార్ భార్య పోలీసులు వేడుకుంటుంది.
ప్రియురాలితో భర్త.. దేహశుద్ధి చేసిన భార్య..
నార్సింగ్ పీఎస్ పరిధిలోని గంధం గూడలో ఘటన
భార్యకు తెలియకుండా మరో మహిళతో వేణు కుమార్ వివాహేతర సంబంధం
వేణు కుమార్ ప్రియురాలి ఇంటికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
బంధువులతో కలిసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన వేణు… pic.twitter.com/DONa62b4z6
— BIG TV Breaking News (@bigtvtelugu) August 2, 2025
ALSO READ: IBPS Notification: డిగ్రీ అర్హతతో 10,277 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ వెకెన్సీలు.. డోంట్ మిస్