E-Paper
Advertisement

శ్రీదేవికి గోల్డెన్ ఆఫర్ .. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!

శ్రీదేవికి గోల్డెన్ ఆఫర్ .. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!
Advertisement

Sridevi : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేవలం ఈమె చేసిన రెండు సినిమాల్లోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.. రీసెంట్ గా నటించిన బ్యాండ్ మేళం మూవీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈమె ఖాతాలో మరో హిట్ సినిమా పడిపోయింది. ఇప్పుడు తర్వాత ఏ సినిమాలో నటించబోతుంది అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ఏకంగా కోలీవుడ్ లోనే లక్కీ ఛాన్స్ కొట్టేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో ఈమె నటించబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. మరి ఆ హీరో ఎవరు ఏ సినిమాలో నటించబోతుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

రజినీకాంత్ మూవీలో శ్రీదేవికి ఛాన్స్..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన నటిస్తున్న సినిమాలు ఈ మధ్య ప్రతి ఒక్కటి కూడా సూపర్ హిట్ అవడంతో. ఆయనతో సినిమాలు చేసేందుకు ఇండస్ట్రీలోని నటీనటులు ఆసక్తి కనబరుస్తున్నారు.. అయితే తెలుగు యంగ్ హీరోయిన్ కోర్టు మూవీ ఫేమ్ శ్రీదేవికి ఈయన నటించిన సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు ఓ వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. కమల్ హాసన్ నిర్మాణం లో రజినీకాంత్ హీరో గా నటిస్తున్న సినిమాలో శ్రీదేవి ఒక కీలక పాత్ర పోషిస్తుందని, దానివల్లే ఆమె ఇలా పోస్టులు పెడుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణి, మనోజ్ కు ప్రభావతి వార్నింగ్.. మనోజ్ కు కడుపుమంట.. రోహిణి పై మీనాకు అనుమానం..

కోలీవుడ్ లో బిజీగా శ్రీదేవి..

కోర్ట్ మూవీతో తెలుగు ప్రేక్షకులో మనసులో క్రేజీ హీరోయిన్గా ముద్ర వేసుకుంది శ్రీదేవి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఆడిషన్స్ ఇచ్చి కష్టపడి సినిమాల్లో అవకాశాలని అందుకుంటే ఈమె మాత్రం కేవలం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసి క్రేజీ ఆఫర్ ని కొట్టేసింది. నాచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ మూవీలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వచ్చిన బ్యాండ్ మేళం మూవీ కూడా బాగానే ఆకట్టుకుంది. ఇప్పటికే శ్రీదేవి కోలీవుడ్ లో బాగా బిజీ అయ్యింది. కేజీఆర్ సరసన ఆమె ఒక చిత్రం లో నటిస్తోంది.. సూపర్ స్టార్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు.. పాన్ ఇండియా హీరోయిన్గా పాపులర్ అవ్వచ్చు అని చాలామంది ఆశ పడుతుంటారు. కానీ అలాంటి అవకాశం ఎవరికీ రాలేదు. చిన్న వయసులోనే శ్రీదేవికి రావడం విశేషం. మరి ఈ మూవీ తర్వాత ఈమెయిల్ లైఫ్ ఎలా మారుతుందో చూడాలి.. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×