Jim Jim Taara: ‘జిమ్ జిమ్ తార.. జిలేబి తేరా చిన్నోడా’..ఇపుడు నెట్టిల్లు ఓపెన్ చేస్తే చాలు ..ఈ పాట తెగ ఊదరగొట్టేస్తుంది. నిజానికి ఒకప్పుడు జానపదాలు ఉన్నా ఇంతగా హైలెట్ అవ్వలేదు.
కాని ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఏదైనా సరే ఇట్టే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ పాటలకు డీజే బీట్స్ యాడ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో తెగ వైరల్ చేస్తుండటంతో ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘జిమ్ జిమ్ తార.. జిలేబి తేరా చిన్నోడా’ పాటకి అనుపమ పరమేశ్వరన్ కూడా స్టెప్పులు వేయడం విశేషం. అక్టోబర్ 16 న తాను నటించిన క్రేజీ కల్యాణం సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చేసిన ప్రమోషన్స్ లో భాగంగా ఇలా జిమ్ జిమ్ తార.. జిలేబి తేరా చిన్నోడా అనే పాటకి డాన్స్ చేస్తూ సందడి చేసింది.ఇక ఈ వీడియోలో సినిమాలో నటించిన తరుణ్ భాస్కర్ అలాగే రాజు వెడ్స్ రాంబాయ్ ఫేమ్ అఖిల్ కూడా ఉండటం విశేషం . చూడాలి మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో.
ఇక అనుపమ విషయానికి వస్తే ‘ప్రేమమ్’, ‘అ ఆ’, ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మలయాళ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ‘టిల్లు స్క్వేర్’లో లిల్లీ పాత్రతో యూత్‌లో మంచి క్రేజ్ కొట్టేసింది .
ఇక ‘జిమ్ జిమ్ తార’ పాట విషయానికి వస్తే ఈ పాట పాడిన సింగర్ పేరు గోకుల లక్ష్మీదేవి. లక్ష్మీ ఆంటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈవిడ రాయలసీమ ప్రాంతానికి చెందినవారు.ఇక ఈవిడ గతంలో పాడిన ‘అత్తరు సాయిబు’ పాట కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది కూడా .
తనదైన యాస, సహజమైన గాత్రంతో జానపద పాటలు పాడటమే కాకుండా భక్తి పాటలు, దేవుడి తత్వాలకు సంబంధించిన గీతాలను కూడా పాడటం విశేషం. ఇప్పుడు ‘జిమ్ జిమ్ తార.. జిలేబి తేరా చిన్నోడా’ పాట మరోసారి సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతు ఉండటంతో ప్రముఖులు కూడా ఈ పాటని తమ మూవీ ప్రమోషన్స్ కి వాడుతూ సినిమాలపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక ఈ పాటకు డీజేలు యాడ్ చేస్తూ రీమిక్స్‌లు చేయడం కూడా పాపులారిటీ పెరగడానికి ఒక కారణమని చెప్పాలి. సాధారణంగా జానపద పాటలకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉంటుందన్న సంగతి తెల్సిందే. అయితే ఇప్పుడు డీజే వెర్షన్లు, రీల్స్, షార్ట్స్ కారణంగా అలాంటి పాటలు సిటీలలో కూడా ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి . గతంలో నాది నక్కిలీసు గొలుసు ,జారు మిటాయి వంటి పాటలు ఎలా వైరల్ అయ్యాయో చెప్పక్కర్లేదు.
ALSO READ :బషీర్ మాస్టర్ సంపాదన మామూలుగా లేదుగా.. ఏకంగా సినిమా బడ్జెట్!
మొత్తానికి సోషల్ మీడియా పుణ్యాన మారు మూల ప్రాంతాలలో ఉన్న టాలెంట్ ఇలా బయటికి రావడం ఒక మంచి పరిణామం అనే చెప్పాలి.చూడాలి మరి ముందు ముందు అనుపమ బాటలో ఇంకెందరు ప్రయాణిస్తారో !
https://Twitter.com/sairaaj44/status/2108922228557631929/video/1