E-Paper
Advertisement

బషీర్ మాస్టర్ సంపాదన మామూలుగా లేదుగా.. ఏకంగా సినిమా బడ్జెట్!

బషీర్ మాస్టర్ సంపాదన మామూలుగా లేదుగా.. ఏకంగా సినిమా బడ్జెట్!
Advertisement

Basheer Master Earnings:సినిమాలు చేయకున్నా కేవలం సంగీత్ ఈవెంట్స్ అండ్ కవర్ సాంగ్స్ తోనే పాపులర్ అయిన బషీర్ మాస్టర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు.

ముఖ్యంగా రాకేశ్ మాస్టర్ శిష్యరికంలో డీ షో ద్వారా మంచి గుర్తింపే సంపాదించాడు బషీర్ మాస్టర్. అయితే కారణం ఏంటో గాని యూట్యూబ్ లో మాస్టర్ పెట్టే కవర్ సాంగ్స్ కి ప్రశంసలు కన్నా విమర్శలనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బషీర్ మాస్టర్ తన సంపాదన గురించి పలు ఆసక్తికర విషయాలని చెప్పుకొచ్చాడు.

Advertisement

 రెండేళ్లలో ఏకంగా 80 లక్షల వరకు

దేవుడి వల్ల తనకి డబ్బులకేమి ఇబ్బంది లేదని,తన బ్యాంకు బాలెన్స్ మంచిగానే ఉందని, సంగీత్ ఈవెంట్స్ వల్ల డబ్బులు బాగానే సంపాదించానని, ఇక గత రెండేళ్లలో తాను ఏకంగా 80 లక్షల వరకు సంపాదించానని చెప్పుకొచ్చాడు.కాబట్టి తాను ఎవరి వద్దా చేయి చాపి అడుకున్నే అవసరం రాలేదని తెలిపాడు.ఇక మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు ఒక ఐదు కోట్లపైనే సంపాదించానని తన సంపాదన గురించి వివరించాడు బషీర్ మాస్టర్.

Advertisement

హైదరాబాద్ లో త్వరలోనే విల్లా

ఇక హైదరాబాద్ లో సొంత విల్లా ఉందన్న కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ తనకు విల్లా ఏమీ లేదని, కేవలం ల్యాండ్ మాత్రమే ఉందని ,కానీ త్వరలోనే విల్లా తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.అయినా కేవలం ఒక చిన్న ఫోన్ కొంటేనే తన ఫాలోవర్స్ కి చెప్పానని అలాంటిది ఇల్లు తీసుకుంటే ఎందుకు చెప్పనని, ఫాలోవర్స్ వల్లే తాను ఈ రేంజ్ కి వచ్చాను కాబట్టి విల్లా కొంటె ఖచ్చితంగా చెబుతానని తెలిపాడు.

నమ్మకం మీదే జీవితం

ఇక తిరుపతికి తాను ఇప్పటి వరకు ఐదు సార్లు వెళ్లానని, వెంకటేశ్వర స్వామీ ఏది కోరుకుంటే అది ఇస్తాడని ,మోకాళ్ళ మీద నడిస్తే మంచి జరుగుతుందని తన అనుభావాన్ని చెప్పాడు.అయితే గట్టిగా నమ్మాలని ,నమ్మకం మీదే జీవితం ఉంటుందని కాబట్టి దేవుడు మంచి చేస్తాడని నమ్మి వెళ్తే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయని మనసులోని మాటని బయటపెట్టాడు.

వారణాసికి అవకాశం వస్తే 

ఇక తన కవర్ సాంగ్స్ చూసి ఎవరైనా పెద్ద సినిమాలకి కొరియోగ్రఫీ చేయుమని అడిగితే ఖచ్చితంగా చేస్తానని ,కాని వాళ్ళు అడగాలని ,వాళ్ళు అడగడం ఒకటే బ్యాలెన్స్ ఉందని తెలిపాడు.ఇక వారణాసి కి అవకాశం వస్తే చేస్తారా అని అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇస్తూ ఎందుకు చేయను కాని ఎప్పుడో పాటల షూటింగ్ అయిపోయిందని, డాన్స్ యూనియన్ కి సెక్రెటరీ గా ఉన్న తనకి అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పుకొచ్చాడు.

బషీర్ మాస్టర్ ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో !

ఇక తనకి కుటుంబ సభ్యుల సపోర్ట్ చాలా ఉందని,వాళ్ళ వల్లే తాను పైకి ఎదిగానని, ముఖ్యంగా తన భార్య ఇచ్చే సపోర్ట్ అసలు మర్చిపోలేనని తెలిపాడు. ఇక బిగ్ బాస్ షో లో గెస్ట్ గా అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తానని ,తన కెరీర్ కి బిగ్ బాస్ ని ఎలా ఉపయోగించుకోవాలో తనకి బాగా తెలుసని కోరికని బయట పెట్టాడు బషీర్ మాస్టర్.చూడాలి మరి బిగ్ బాస్ ఛాన్స్ దొరికితే బాగుండు అని ఆశ పడుతున్న బషీర్ మాస్టర్ ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో !

ALSO READ :నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారంటే ..బషీర్ మాస్టర్ ఆన్సర్ ఇదే !

Tags

Related News

జగపతిబాబు హోస్ట్ గా ఐకానిక్ టాక్ షో సీజన్ 2 ప్రారంభం… వీడియో వైరల్!

నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారంటే ..బషీర్ మాస్టర్ ఆన్సర్ ఇదే !

ఇంద్రజ జబర్దస్త్ రెమ్యునరేషన్ అంతా.. మరి నాగబాబుకి?

బిగ్ బాస్ 10 విన్నర్ పై కౌశల్  మండా కామెంట్స్.. నవరసాలు పండిస్తున్న కంటెస్టెంట్ అంటూ!

త్రిగుణ్ కూతురిపై అపూర్వ కామెంట్..హద్దులు దాటుతున్న మాటలు!

అపూర్వ ఎలిమినేటెడ్.. వైల్డ్ కార్డు ఎంట్రీలో సంపాదించింది ఎంతంటే?

సోల్ మేట్ దొరికేశాడు..పెళ్లి పీటలెక్కబోతున్న రోహిణి!

Big Stories

Advertisement
×