E-Paper
Advertisement

పిల్లలు పుట్టే వరకు వాటిని పెంచుకుంటాం…విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

పిల్లలు పుట్టే వరకు వాటిని పెంచుకుంటాం…విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!
Advertisement

Vijay Devarakonda: టాలీవుడ్ సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణ బాలి(Ranabaali) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈయన ఈ సినిమా ప్రమోషన్లలో క్షణం తీరిక లేకుండా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. రాహుల్ సాంకృత్యన్ ( Rahul Sankrityn)దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక (Rashmika)హీరో హీరోయిన్లుగా నటించిన రణబాలి సినిమా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

పిల్లల గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్..

పెళ్లి తర్వాత విజయ్ రష్మిక జంటగా నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి అదేవిధంగా సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కూడా సినిమా పట్ల భారీ అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు అభిమానులతో కలిసి ఈయన సందడి చేశారు ఇందులో భాగంగానే పుట్టబోయే పిల్లల గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

గుర్రాలను పెంచుకుంటాము..

Advertisement

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తనకు రణబాలి సినిమా ముందు వరకు కూడా హార్స్ రైడింగ్ రాదని ఈ సినిమా కోసమే తాను హార్స్ రైడింగ్ నేర్చుకున్నానని తెలిపారు. అయితే మాకు పిల్లలు పుట్టే వరకు తాను గుర్రాలను పెంచుకోవాలనుకుంటున్నానని తెలిపారు. ఒక గుర్రం పెంచుకుంటే అది డిప్రెషన్ లోకి పోతుందని అందుకే ఇంకొక గుర్రం కూడా తీసుకువస్తాను అంటూ సరదాగా ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం గురించి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విజయ్ రష్మిక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా..

ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు మరి పిల్లల విషయంలో గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ రణబాలి సినిమాలో జంటగా సందడి చేయబోతున్నారు. ఇదివరకు వీరి కాంబినేషన్లో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడటం ఇన్నేళ్లు ప్రేమలో ఉంటూ ఈ ఏడాది పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

Advertisement

Also Read: జగపతిబాబు హోస్ట్ గా ఐకానిక్ టాక్ షో సీజన్ 2 ప్రారంభం… వీడియో వైరల్!

Related News

నాగవంశీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్.. కారణం ఇదే!

రజనీకాంత్  భాషా సీక్వెల్  అందుకే చేయలేదా?కారణం అదేనా?

ఎక్కడ చూసినా జిమ్ జిమ్ తార.. ఇప్పుడు అనుపమ వంతు!. వైరల్ వీడియో

సంధ్య 70MM హిస్టరీ.. ఈ థియేటర్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

వాళ్లంతా క్రిమినల్స్.. డైరెక్టర్లపై రెచ్చిపోయిన కోన వెంకట్!

‘రణబాలి’లో అంత మ్యాటర్ ఉందా.. విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే!

రణబాలి కోసం విజయ్ రష్మిక రెమ్యూనరేషన్ ఎంతంటే?

Big Stories

Advertisement
×