Illu Illalu Pillalu Today Episode june 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు మాట వినలేదని ధీరజ్ పై కోపంగా అరుస్తూ మిల్లుకు వెళ్తాడు. వెనకాల కూర్చున్న తిరుపతి ఎందుకు బావ అంత కోపంగా ఉన్నావేంటి అని అడుగుతాడు. నా కోపానికి కారణం ఏంటో నీకు తెలియదా? ఈరోజు నా మాట వినకుండా తను ఇష్ట ప్రకారమే చేయాలని అనుకుంటున్నాడు. నేను వాడు ఇంటింటికి వెళ్లి కష్టపడుతున్నాడని వాడికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన కూడా వాడు నా మాట అంటే లెక్కచేయకుండా ఉన్నాడు అని రామరాజు అంటుంటాడు. ధీరజ్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు బావ అని అంటాడు. ఎంత చెప్పినా కూడా రామరాజు నా మాటే నెగ్గాలి అని అనడంతో తిరుపతి ధీరజ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. వేదవతి మాత్రం కొడుకును కొట్టడం పై ఫీల్ అవుతుంది.. శ్రీవల్లి నోటి దూల చూపిస్తుంది. తండ్రి మాటని లెక్కచేయకుండా అదేం పద్ధతి అండి అని అంటుంది. ఆ మాట విన్న ప్రేమ మా విషయంలో నువ్వు ఎందుకు పానకంలో పుడకలాగా ఎంటర్ అవుతున్నావు అని అరుస్తుంది.. ఇంకొకసారి మా విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ ఒకసారి ఆయన మిల్లుకు రావాలి అంటాడు. మరొకసారి నాకు నీకు ఏ సంబంధం లేదు నువ్వు సంపాదించి ఇవ్వాలి అని అంటాడు. ఇలా ఒక్కసారి రెండుసార్లు అంటే పర్వాలేదు కానీ ప్రతిసారి ఇలా అంటూ ఉంటే ఎలా ఆయన మాటను వినాలి అన్నయ్య. నాక్కూడా కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది కదా అని ధీరజ్ అనగానే అన్నదమ్ములు నీ ఇష్టం రాని వదిలేస్తారు. ఇక వేదవతి తండ్రి కొడుకులను ఒకచోట చేర్చి కలపాలని ప్లాన్ వేస్తుంది. ప్రేమ కూడా సపోర్ట్ చేస్తుంది.. తండ్రి కొడుకులు కలిసి భోజనం చేస్తే కోపం తగ్గిపోతుందని అనుకుంటుంది వేదవతి..
ధీరజు భోజనానికి వెళ్తుంటే ప్రేమ ఆపుతుంది. రామరాజు వచ్చిన తర్వాత భోజనానికి రమ్మని ప్రేమతో అంటుంది. ఇక ధీరజ్ వెళ్తూ ఉంటే ప్రేమ అడ్డుపడుతుంది. రామరాజు వచ్చి కూర్చోగానే ప్రేమ పంపిస్తుంది. భోజనం చేస్తున్న రామరాజు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. వేదవతి ఎంత చెప్పినా కూడా రామరాజు వినకుండా వెళ్ళిపోతాడు. ధీరజ్ కూడా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. పొద్దున జరిగిన గొడవ కాస్త తగ్గుతుందని అనుకున్నాను కానీ ఇలా ఉంటారని అస్సలు అనుకోలేదు.. వేదవతి తండ్రి కొడుకులు మధ్య గొడవకి కారణం నేనే అని బాధపడుతూ ఉంటుంది. వీళ్ళ మధ్య దూరం ఎప్పుడు తగ్గుతుందా అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది.
ప్రేమ నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి మాకు బాధపడదని చెప్పారు అత్తయ్య మీరు ఇప్పుడు బాధపడుతున్నారా అని అడుగుతారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాతే ధీరజ్ కి కష్టాలు మొదలయ్యాయి అని వాడు బాధపడుతున్నాడు. ప్రేమతో పెళ్లి జరగడానికి కారణం నేనే అని ఆయనకు తెలిసేలా చేస్తాను. వాడి మీద నాకు కోపం తగ్గిపోతుంది అని అనుకుంటుంది. నేను ఆరోజు ఇచ్చిన మాట ప్రకారం వాడికి పెళ్లి చేశాను. ఇప్పుడు వాడిపై కోపం పెరగడానికి నేనే కారణం అయిపోయాను. ఈ పెళ్లి జరగడానికి అసలు కారణం నేనే అన్న విషయాన్ని ఆయనకు చెప్పేస్తాను అప్పుడు కోపం తగ్గిపోతుంది అని వేదవతి అంటుంది..
Also Read : అర్ధరాత్రి తండ్రి దగ్గరకు ఆరాధ్య.. పల్లవికి దెబ్బకు అవనికి మైండ్ బ్లాక్..
అయితే, వేదవతి రామరాజు దగ్గరికి వెళ్తుంటే నర్మదా ఆపుతుంది.. నువ్వు ఇప్పుడు వెళ్లి నిజం చెప్తే ముగ్గురం ఆయనకు ఎన్ని రోజులు అబద్ధం చెప్పామని అనుకుంటారు.. మన ముగ్గురం కలిసి ధీరజ్ పెళ్లి చేశామని మావయ్య గారు మన ముగ్గురు మీద ద్వేషం పెంచుకుంటారు. ఇప్పుడు చెప్పడం అవసరమంటావా అని నర్మదా అంటుంది. అయితే వేదవతి నర్మద మాట విని చెప్పడం ఆపేస్తుంది. ధీరజు వాళ్ళ నాన్న అన్న మాటలు విని బాధపడుతూ ఉంటాడు. వీడు ఇలా బాధపడడానికి కారణం నేనే వీడి బాధను ఎలాగైనా పోగొట్టాలని ప్రేమ అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..