Bone Cancer Symptoms: మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. ప్రతి భాగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఎముకలు మన శరీరానికి ఆధారాన్ని, కదలికకు తోడ్పాటును అందిస్తాయి. అలాంటి ఎముకలకు క్యాన్సర్ సోకడం అనేది ఒక తీవ్రమైన సమస్య. ఎముకల క్యాన్సర్, లేదా ఆస్టియోసార్కోమా.. ప్రారంభ దశల్లో నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ అది కొన్ని హెచ్చరిక సంకేతాలను చూపుతుంది. ఈ సంకేతాలను సకాలంలో గుర్తిస్తే.. ప్రాణాలను రక్షించుకోవచ్చు. మరి నిశ్శబ్దంగా ప్రాణాలను హరిస్తోన్న బోన్ క్యాన్సర్ లక్షణాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. నిరంతరం ఎముకల నొప్పి:
సాధారణంగా దెబ్బ తగిలినా లేదా ఎక్కువ పని చేసినా నొప్పి వస్తుంది. కానీ బోన్ క్యాన్సర్ వల్ల వచ్చే నొప్పి అలా కాదు. నిరంతరం ఉంటుంది. ఇది రాత్రి పూట మరీ ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా తగ్గదు. ఇది బోన్ క్యాన్సర్‌కు ముఖ్యమైన సంకేతం. మీ శరీరం మీకు పంపే ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవచ్చు.
2. వాపు లేదా కణితి:
ఎముకల్లో నొప్పితో పాటు.. ప్రభావిత ప్రాంతంలో వాపు లేదా గట్టి కణితి ఏర్పడుతుంది. ఇది ఎముకకు దగ్గరగా ఉండే కండరాలు లేదా కణజాలంపై ఒత్తిడి పెరగడం వల్ల సంభవిస్తుంది. ఈ వాపు నెమ్మదిగా పెరిగి.. ఆ ప్రాంతం సున్నితంగా మారుతుంది.
3. బలహీనమైన ఎముకలు & సులభంగా పగుళ్లు:
కొన్నిసార్లు.. చిన్నపాటి దెబ్బ తగిలినా లేదా ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఎముకలు విరుగుతాయి. క్యాన్సర్ కణాలు ఎముకను బలహీన పరచడం వల్ల ఇది జరుగుతుంది. ఇది తరచుగా ఎముక క్యాన్సర్ ఉన్నట్లు తెలియకుండానే.. పగుళ్లు ద్వారా బయటపడుతుంది.
4. కీళ్ల నొప్పి లేదా పరిమిత కదలిక:
క్యాన్సర్ ఎముక చివరలలోని కీళ్ళకు దగ్గరగా ఉంటే.. కీళ్ల నొప్పి లేదా కదలికలో మార్పులు జరుగుతాయి. ఇది కీళ్ల నొప్పులుగా మారే అవకాశం ఉంటుంది. కానీ అది ఎముకల క్యాన్సర్ లక్షణం కావచ్చు.
5. అకస్మాత్తుగా బరువు తగ్గడం:
క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు తరచుగా ఆకలి తగ్గడానికి, తెలియని కారణాల వల్ల బరువు తగ్గడానికి దారితీస్తాయి. మీరు ఆహారపు అలవాట్లను మార్చుకోకుండానే గణనీయంగా బరువు తగ్గితే.. అది ఆందోళన కలిగించే విషయం.
6. అలసట & బలహీనత:
శరీరం క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు.. అది ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఫలితంగా నిరంతర అలసట, బలహీనత కలుగుతుంది. మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నా సరే.. అలసిపోయినట్లు అనిపిస్తే, అది బోన్ క్యాన్సర్ సంకేతం కావచ్చు.
7. జ్వరం & చలి:
కొంతమంది ఎముకల క్యాన్సర్ రోగులు వివరించలేని జ్వరం లేదా చలిని అనుభవిస్తుంటారు. ఇది తరచుగా ఎక్కవగా వస్తుంటుంది. అంతే కాకుండా శరీరంలో ఏదో ఒక ఇన్ఫెక్షన్ లేదా అంతర్గత సమస్య ఉందని సూచిస్తుంది.
Also Read: ఇక డయాబెటిస్‌కు గుడ్ బై.. ఈ ఒక్క పౌడర్ వాడితే షుగర్ కంట్రోల్
8. రాత్రి చెమటలు:
రాత్రిపూట అధికంగా చెమటలు పట్టడం అనేది క్యాన్సర్, ముఖ్యంగా లింఫోమా వంటి కొన్ని రకాలకు సాధారణ లక్షణం. ఎముకల క్యాన్సర్‌లో కూడా ఇది కనిపించవచ్చు. ప్రత్యేకించి వ్యాధి ముదిరినప్పుడు రాత్రి పూట చెమటలు పడుతుంటాయి .
9. నడవడంలో ఇబ్బంది:
కాళ్ళ ఎముకల్లో క్యాన్సర్ ఉన్నప్పుడు.. అది నొప్పి, బలహీనత లేదా పగుళ్ల కారణంగా నడవడానికి ఇబ్బంది కలిగిస్తుంది. నడిచేటప్పుడు అసౌకర్యం కూడా ఉంటుంది.
10. తిమ్మిర్లు లేదా స్పర్శ కోల్పోవడం:
కొన్నిసార్లు క్యాన్సర్ కణితి నరాలపై ఒత్తిడి కలిగించడం వల్ల తిమ్మిర్లు, జలదరింపు లేదా ప్రభావిత ప్రాంతంలో స్పర్శ కోల్పోవడం వంటివి జరుగుతాయి.