BigTV English

BCCI New Fitness Test : టీమిండియా ప్లేయర్లకు కొత్త పరీక్షలు… 1200 మీటర్లు.. ఐదు రౌండ్లు… రెస్ట్ లేకుండా పరిగెత్తాల్సిందే

BCCI New Fitness Test : టీమిండియా ప్లేయర్లకు కొత్త పరీక్షలు… 1200 మీటర్లు.. ఐదు రౌండ్లు… రెస్ట్ లేకుండా పరిగెత్తాల్సిందే

BCCI New Fitness Test : టీమిండియా క్రికెటర్ల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే వాస్తవానికి టీమిండియాలోకి ఒక క్రికెటర్ అడుగుపెట్టాలంటే ఆటతో పాటు ఫిట్ నెస్ కూడా సాధించాలి. ఫిట్ నెస్ లో కానీ ఆటలో కానీ విఫలం చెందితే టీమిండియాలో చోటు కోల్పోతారు. అయితే ఈ సారి టీమిండియా ఆటగాళ్లకు కొత్త పరీక్షలు ఉండనున్నాయి. ముఖ్యంగా ఫిట్ నెస్ పెంపొందించడానికి బీసీసీఐ రబ్బీ సెంట్రిక్ బ్రోంకో పరీక్షను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక నుంచి ప్రతీ ఆటగాడు ప్రతి సెట్ లో 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్లు పరుగెత్తాలి. ఇలా 5 సెట్ లను పూర్తి చేయాలి. అంటే మొత్తం 1200 మీటర్లు పరుగెత్తాలి అన్నమాట. ఇదంతా కేవలం 6 నిమిషాల్లో రెస్ట్ లేకుండా చేసిన వారే పూర్తి ఫిట్ నెస్ సాధించినట్టు లెక్క.


Also Read : Nicholas Pooran : స్టంప్ ఔట్ ఎఫెక్ట్… నికోలస్ పురాన్ కిందపడి ఎలా గిలగిల కొట్టుకున్నాడో చూడండి

కొత్త పరీక్షలకు వారికి చెక్.. 


కొత్త పరీక్షలతో సీనియర్ ఆటగాళ్లకు చెక్ పెట్టవచ్చని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఈ కొత్త పరీక్షలు ఎవ్వరికీ మేలు చేకూరుస్తాయి. ఎవ్వరికీ నష్టం చేకూరుస్తాయనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ మంచి ఫిట్ నెస్ సాధించారు. రోహిత్ శర్మ కంటే కోహ్లీ మంచి ఫిట్ గా ఉంటాడు. చాలా హుషారుగా పరుగెత్తుతాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు పదే పదే గాయాల బారిన పడుతుండటంతో వారి ఫిట్ నెస్ ను మెరుగుపరిచే లక్ష్యంతో బ్రాంకో టెస్ట్ అనే సరికొత్త కఠినమైన పరీక్షను ప్రవేశపెట్టింది బీసీసీఐ.  ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ మినహా మిగతా బౌలర్లు అందరూ గాయపడటంతో బీసీసీఐ ఈ దిశగా కఠిన చర్యలు చేపట్టినట్టు సమాచారం.

6 నిమిషాల్లో 1200 మీటర్లు.. 

ఇప్పటికే అమలులో ున్న యో-యో టెస్ట్ 2 కిలోమీటర్ల టైమ్ ట్రయల్ కి అదనంగా ఈ బ్రాంకో టెస్ట్ ను చేర్చారు. ఈ పరీక్షలో 20, 40, 60 మీ టర్ల చొప్పున షటిల్ రన్స్ చేయాలి. ఈ మూడింటిని కలిపి ఒక సెట్ గా పిలుస్తారు. ఇలా మొత్తం 5 సెట్లను విశ్రాంతి లేకుండా పూర్తి చేయాలి. కేవలం 6 నిమిషాల వ్యవధిలో 1200 మీటర్ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. ఇది ఆటగాళ్ల వేగం, ఓర్పును నిశితంగా పరీక్షిస్తుంది. టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లే రౌక్స్ ఈ పరీక్షను సూచించగా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దీనికి పూర్తిగా మద్దతు తెలిపినట్టు సమాచారం. మరోవైపు ఫాస్ట్ బౌలర్లు మైదానంలో తగినంతగా పరుగెత్తడం లేదని.. ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతున్నారని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫిట్ నెస్ ప్రమాణాలను స్పష్టంగా నిర్దేశించాలనే ఉద్దేశంతోనే ఈ బ్రాంకో టెస్ట్ తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ కొత్త విధానంతో ఆటగాళ్ల ఫిట్ నెస్ మెరుగుపడి గాయాల బెడద తగ్గుతుందని ఆశిస్తోంది బీసీసీఐ.

Related News

MS Dhoni: రోహిత్‌, కోహ్లీని గెంటేశారు..కానీ ధోనిని ఎవ‌డు కూడా ట‌చ్ చేయ‌లేదు..కార‌ణం ఇదే

World Cup 2027: రోహిత్, కోహ్లీ ప్రపంచ కప్ 2027 ఆడాలంటే..ఈ రూల్స్ పాటించాల్సిందే !

Tazmin Brits: ఒకే ఏడాది 5 సెంచరీల‌తో రికార్డు…రాముడి అవ‌తారం ఎత్తిన సౌతాఫ్రికా లేడీ..అచ్చం కోహ్లీ లాగే

MS Dhoni: ఇంటికి వెళ్లి నీ తండ్రిలాగే ఆటో న‌డుపుకో.. సిరాజ్ పై ధోని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

Shahid Afridi: క్రికెట్ వ‌దిలేసి, కిచెన్ లో వంట‌లు చేసుకోండి..మ‌హిళ‌ల జ‌ట్టును అవ‌మానించిన‌ అఫ్రిది

Pakistan Players: రిజ్వాన్ ఇంట పెళ్లి సందడి.. త‌మ‌న్నా పాట‌ల‌కు స్టెప్పులేసిన‌ పాక్ ప్లేయ‌ర్లు

India Schedule: 2026 వ‌ర‌కు వ‌రుస‌గా మ్యాచ్ లే…ప్లేయ‌ర్ల‌కు రెస్ట్ కూడా లేదు..టీమిండియా కొత్త షెడ్యూల్ ఇదే

Kranti Goud: మ‌గాడిలా ఉందంటూ ట్రోలింగ్‌..కానీ పాకిస్థాన్ పై బుమ్రాలా రెచ్చిపోయింది

Big Stories

×