Dhurandhar Trailer: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ ‘ధురంధర్’ గురించి పరిచయం అక్కర్లేదు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రివేంజ్’ (Dhurandhar The Revenge) సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను రేపు, అంటే మార్చి 7వ తేదీ ఉదయం 11:01 గంటలకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నారు. ‘హోంస్లా.. ఈంధన్.. బద్లా’ (ధైర్యం.. ఇంధనం.. ప్రతికారం) అనే పవర్‌ఫుల్ నినాదంతో వస్తున్న ఈ సీక్వెల్, మొదటి భాగం కంటే రెట్టింపు యాక్షన్‌తో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.
Read also-Dishwasher vs Hand Washing: అంట్లు తోమడానికి .. రెండింటిలో ఏది బెస్ట్.. పైచేయి మనిషిదా? మిషన్‌దా?
డైరెక్టర్ ఆదిత్య ధర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు భారీ తారాగణం నటిస్తోంది. కీలక పాత్రల్లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా మరియు సారా అర్జున్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 19, 2026న విడుదల చేయనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
మొదటి భాగం సుమారు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సీక్వెల్ కూడా అదే రేంజ్‌లో బిజినెస్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా రణ్‌వీర్ సింగ్‌కు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ఇక్కడ కూడా భారీ స్థాయిలో థియేటర్లను కేటాయిస్తున్నారు. సుమారు 3 గంటల 55 నిమిషాల నిడివితో వస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి. ఈ నుంచి రాబోతున్న ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
HONSLA EENDHAN BADLA
Trailer out tomorrow 7th March at 11:01 AM#DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam pic.twitter.com/uieSQVIX0g
— Sanjay Dutt (@duttsanjay) March 6, 2026