E-Paper
Advertisement

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!
Advertisement

Hyderabad to Alampur Buses: జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవాలని అనుకుంటున్న భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి అలంపూర్‌ లోని ప్రసిద్ధ జోగులాంబ అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు  ఎక్స్‌ ప్రెస్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజూ రెండు సర్వీసులను నడుపుతోంది. ముఖ్యంగా సొంత వెహికల్  లేకుండా ఆలయానికి వెళ్లాలనుకునే భక్తులకు బస్సు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది.

హైదరాబాద్ నుంచి అలంపూర్‌కు బస్సు టైమింగ్స్

హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS) నుంచి అలంపూర్‌కు వెళ్లే రెండు ఎక్స్‌ప్రెస్ సర్వీసుల నడుస్తాయి.  మొదటి సర్వీస్ ఉదయం 6:45 గంటలకు బయలుదేరి ఉదయం 11:15 గంటలకు అలంపూర్ చేరుకుంటుంది. రెండో సర్వీస్ మధ్యాహ్నం 12:30 గంటలు బయలుదేరి సాయంత్రం 5:00 గంటలకు అలంపూర్ చేరుకుంటుంది. ప్రయాణ సమయం సుమారు 4 గంటల 30 నిమిషాలు ఉంటుంది. అయితే ట్రాఫిక్, రూట్ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల బస్సు చేరుకునే సమయం మారవచ్చు.

జోగులాంబ అమ్మవారి ఆలయం గురించి..  

Advertisement

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న అలంపూర్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన జోగులాంబ అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా భక్తుల విశ్వాసాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. అలంపూర్‌లోని ప్రాచీన నవబ్రహ్మ ఆలయాలు కూడా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళను చూడటానికి పర్యాటకులు సైతం ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయం కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో అలంపూర్ ఉంది. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగా కూడా ప్రాధాన్యత కలిగి ఉంది. శ్రీశైలం క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా అలంపూర్‌ను పేర్కొంటారు.

ప్రయాణానికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

హైదరాబాద్ నుంచి బయలుదేరే భక్తులు తమకు అనుకూలమైన సర్వీస్‌ను ఎంచుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. పండుగలు, ప్రత్యేక పూజల సమయంలో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే బయలుదేరడం మంచిది. బస్సు బయలుదేరే ప్లాట్‌ఫామ్, టికెట్ ధర, సర్వీస్ నడిచే రోజులు లాంటి వివరాలను ఆర్టీసీ ద్వారా నిర్ధారించుకోవాలి. హైదరాబాద్ నుంచి అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళ్లాలనుకునేవారికి ఈ రెండు బస్సుల టైమింగ్స్ ఉపయోగపడుతాయి. ప్రయాణానికి ముందు తాజా షెడ్యూల్‌ను ఒకసారి చెక్ చేసుకుని బయలుదేరితే అనవసరమైన ఇబ్బందులు పడకుండా ఉంటుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Read Also: దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ!

 

Tags

Related News

రష్యా యువతి.. బీహార్ యువకుడు.. సోషల్ మీడియాలో లవ్ స్టోరీ వైరల్!

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ!

గ్రీన్ ట్రాన్స్ పోర్టుపై ఆర్టీసీ ఫోకస్.. కొత్త ఎలక్ట్రిక్, CNG బస్సులు వచ్చేస్తున్నాయ్!

విమానాల్లో సిగరేట్‌పై నిషేధం.. కానీ బాత్రూమ్‌లో యాష్ ట్రేలు ఎందుకు? కారణం తెలిస్తే ఆశ్చర్యమే!

IRCTC టికెట్ బుకింగ్.. సీనియర్ సిటిజన్లకు ఉపయోగపడే సూపర్ టిప్స్!

Big Stories

Advertisement
×