E-Paper
Advertisement

పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న బాలయ్య కూతురు.. అక్కడి నుంచే పోటీ!

పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న బాలయ్య కూతురు.. అక్కడి నుంచే పోటీ!
Advertisement

Nandamuri Tejaswini: సినిమా రంగానికి అటు రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమాలలో సత్తా చాటిన సెలబ్రిటీలు ఇక్కడ అభిమానులను సొంతం చేసుకొని.. ఆ అభిమానాన్ని ఓట్లుగా మార్చుకొని రాజకీయాలలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అటు రాజకీయ నాయకులు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ నటులుగా నిర్మాతలుగా కూడా దూసుకుపోతున్నారు. ఇకపోతే సెలబ్రిటీలే కాకుండా ఆ సెలబ్రిటీల వారసులు కూడా ఇప్పుడు పొలిటికల్ రంగం వైపు అడుగులు వేస్తుండడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

విశాఖపట్నం మేయర్ రేసులో తేజస్విని..

ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యేగా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న బాలయ్య.. తన కూతుర్ని కూడా పొలిటికల్ వైపు అడుగులు వేయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం ఎంపీగా బాలయ్య చిన్న కూతురు తేజస్విని భర్త భరత్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చర్చ మొదలయ్యింది
.అసలు విషయంలోకి వెళ్తే.. గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పదవికి జనరల్ మహిళకు రిజర్వేషన్ ఖరారు అయింది. ఈ క్రమంలోనే కూటమి ,వైఎస్ఆర్సిపి నుండి మేయర్ రేసులో ఉన్న పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో బాలయ్య చిన్న కూతురు తేజస్విని, ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సతీమణి లావణ్య పేర్లు వినిపిస్తుండడం గమనార్హం.

విశాఖపట్నం మేయర్ పోటీదారులు వీరే..

Advertisement

అటు వైసీపీ నుండి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సతీమణి హిమ గౌరీ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే అనకాపల్లి మాజీ ఎంపీ బి.శెట్టి సత్యవతికి అవకాశం ఉందని చెబుతున్నారు.. బొత్స ఝాన్సీ పేరు కూడా విశాఖపట్నం మేయర్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నలుగురితో పాటు మరికొందరు కూడా ఈ మేయర్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అలా మొత్తంగా వీరందరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తుండడంతో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.

మేయర్ గా బాధ్యతలు చేపడుతుందా?

ఇకపోతే ఇప్పటికే గ్రేటర్ విశాఖ మేయర్ గా గతంలో ఇద్దరు మహిళలు బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ మహిళకు కేటాయించడంతో ఈ సంఖ్య మూడుకు చేరబోతోంది. ఇకపోతే మిగతా వారంతా పొలిటికల్ పరంగా భారీ పాపులారిటీ అందుకున్న వాళ్లే. ఇటు సినిమా పరంగా తేజస్విని మరింత పేరు సొంతం చేసుకుంది. పైగా ఈమె భర్త భరత్ విశాఖపట్నం ఎంపీగా పనిచేస్తుండడం, ఈమె తండ్రి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ హిందూపురం ఎమ్మెల్యేగా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుండడం తేజస్వినికి బాగా కలిసొస్తుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయాన ఈమెకు మామ కావడం గమనార్హం..ఒకవేళ తండ్రి, భర్త , మామ ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకుని తేజస్విని గనుక విశాఖ మేయర్ గా బాధ్యతలు చేయబడితే తన మేనత్తలలాగే ఈమె కూడా పొలిటికల్ పరంగా మరింత దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

also read: నువ్వింకా శీలవతివేనా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన వేణుస్వామి భార్య!

మల్టీ టాలెంటెడ్ గా తేజస్విని గుర్తింపు..

తేజస్విని గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమె కేవలం సెలబ్రిటీ డాటర్ మాత్రమే కాదు తన తండ్రి హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి పనిచేసింది. బాలయ్యను కొత్తగా చూపించేందుకు ఆమె ఎంతో రీసెర్చ్ చేశారని, అన్ స్టాపబుల్ టీం తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు గతంలో బివిఎస్ రవి కూడా వెల్లడించారు . అంతేకాదు ఇటీవల చిరంజీవి కాకా సినిమాలో కూడా ఈమె నటించబోతుందని, మేకర్స్ కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. కానీ దీనిపై ఆమె భర్త స్పందిస్తూ నటిస్తానంటే తనకు అభ్యంతరం లేదని చెప్పారు. అంతేకాదు అద్భుతంగా డాన్స్ కూడా చేయగలరు తేజస్విని . మరి ఇన్ని టాలెంట్లు ఉన్న ఈమెకు మేయర్ పదవి దక్కితే మరింత ఉపయోగకరంగా ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి చూద్దాం విశాఖ మేయర్ గా ఎవరు గద్దె ఎక్కుతారో…

Related News

విజయ్‌ను ట్రోల్ చేసేవాళ్లు ఇది వినాల్సిందే.. హరీష్ శంకర్ స్ట్రాంగ్ ఆన్సర్!

నన్ను గెలికితే ఎవడినీ వదలను…విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్.. బుల్లిరాజు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

నవరాత్రి స్పెషల్.. అమ్మవారిలా మారిపోయిన కృతి కర్బందా!

భార్యతో గొడవలకు కారణం అదేనా? హర్ష చెముడు ఓపెన్ కామెంట్స్!

సుమతిగా సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. కల్కి 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×