Dil Raju: దిల్ రాజు తిరుగులేని సక్సెస్ ఫుల్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన పప్పులేం ఉడకడం లేదు అంటూ ఈ మధ్య బాగా వార్తలు హల్చల్ చేశాయి. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) వారు పంపిణీ రంగంలోకి అడుగుపెడుతున్నారనే టైమ్ నుంచి.. దీని వెనుక దిల్ రాజు స్కెచ్చే ఉందనేలా టాక్ నడిచింది. ఉందా? లేదా? అనేద పక్కన పెడితే.. అన్నపూర్ణ అయితే పంపిణీ రంగంలోకి దిగింది. ఇంతకు ముందు మైత్రీ వాళ్లకు, దిల్ రాజు (Dil Raju) మధ్య బాండింగ్ దెబ్బతిని, స్వయంగా వాళ్లే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగేశారు. నిజమే ఒకప్పటితో పోల్చుకుంటే దిల్ రాజు హవా కాస్త తగ్గిందనే చెప్పుకోవాలి. కాకపోతే, తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఎఫ్‌డిసి పదవి ఇవ్వడంతో, కాస్త వెనుకా ముందు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read- Karate Kalyani: ఆ వెధవ అన్వేష్ గాడు.. ఇక బత్తాయి జ్యూస్ అమ్ముకోవడమే!
అక్కడ బిజీగా ఉంటే, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పరంగా రోజురోజుకూ కాంపిటేషన్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు మళ్లీ తన జూలు విదుల్చుతున్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా తన సత్తా ఏంటో చూపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమా రైట్స్‌ని కొనేస్తున్నారు. దిల్ రాజు కాస్త స్లో అయ్యాడు, సినిమాలు కూడా సరిగ్గా చేయడం లేదు.. మరో డిస్ట్రిబ్యూటర్‌ని చూసుకుంటే బెటర్ అని ఆయన కిందున్న వారు అనుకున్నారో.. లేదంటే, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలలో తలమునకలై ఉన్నాడో ఏమో తెలియదు కానీ, రేసులో వెనుక బడ్డానని మాత్రం గ్రహించారు. అంతే, బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల నుంచి, చిన్న హీరోల చిత్రాల వరకు కాస్త కంటెంట్ ఉందని తెలిస్తే చాటు.. ఇప్పటి వరకు ఆయా చిత్రాల హీరోల కెరీర్‌లో లేనంత ఆఫర్ ఇచ్చేసి రైట్స్ తీసుకుంటున్నారనేలా టాక్ మొదలైంది.
Also Read- Malayalam movie OTT : ఓటీటీలోకి మూడు నెలల తరువాత మలయాళం మిస్టరీ మూవీ… నాగ దేవత చుట్టూ కథ
ఈ క్రమంలోనే ఆయన ‘కెజియఫ్’ స్టార్ యష్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్ర తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను, ఆ హీరో కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా రూ. 120 కోట్లు పెట్టి దిల్ రాజు సొంతం చేసుకున్నారు. శర్వానంద్ ‘బైకర్’కు 20 కోట్లు, తరుణ్ భాస్కర్ ‘గాయ పడ్డ సింహం’కు రూ. 6 కోట్లు ఇచ్చి థియేట్రికల్ రైట్స్ కొన్నాడని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే, దిల్ రాజు మళ్లీ బరిలోకి దిగాడని అంతా అనుకుంటున్నారు. శిరీష్‌తో కలిసి దిల్ రాజు.. తన పంపిణీ రంగ సామ్రాజ్యాన్ని ఇంకా స్పీడ్ పెంచాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read- Vijay Rashmika wedding: విజయ్ రష్మిక పెళ్లి కోసం ఖర్చు ఎంతో తెలుసా? ఎంతైనా నేషనల్ క్రష్ కదా?