E-Paper
Advertisement

Mohammed Amir On Abhishek: అయూబ్ కు ప‌ట్టిన గ‌తే నీకు ప‌డుతుంది..అభిషేక్ కు అమీర్ వార్నింగ్‌

Mohammed Amir On Abhishek: అయూబ్ కు ప‌ట్టిన గ‌తే నీకు ప‌డుతుంది..అభిషేక్ కు అమీర్ వార్నింగ్‌
Advertisement

Mohammed Amir On Abhishek:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma ) పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఇప్పటివరకు ఖాతా ఓపెన్ చేయలేదు. వరుసగా మూడు సార్లు డక్ అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. అయితే అలాంటి అభిషేక్ శర్మ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ ( Mohammed Amir). నీకు కూడా సైమ్ అయూబ్ ( Saim Ayub)కు పట్టిన గతే పడుతుందని వార్నింగ్ ఇచ్చారు మహమ్మద్ అమీర్. ఏదో ఒక రోజు దొరికిపోతావు జాగ్రత్త అంటూ అభిషేక్ శర్మకు వార్నింగ్ ఇచ్చారు.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

అభిషేక్ శర్మ ఏదో ఒక రోజు దొరికిపోతాడు.. జాగ్రత్త అంటూ అమీర్ వార్నింగ్

Advertisement

టీమిండియా స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ మూడుసార్లు డక్ అవుట్ కావడంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ స్పందించారు. బ్యాటింగ్ పై అభిషేక్ శర్మ కాస్త దృష్టి పెడితే సక్సెస్ అవుతాడని వెల్లడించారు. అభిషేక్ శర్మ ప్రతి బంతిని కూడా సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని.. అలా అయితే అభిషేక్ శర్మ కెరీర్ నాశనం అవుతుందని హెచ్చరించారు మహమ్మద్ అమీర్. ప్రతి బంతి సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించడం చాలా తప్పు అన్నారు. బంతిని ఆడేటప్పుడు ఆచితూచి ఆడాలని కోరారు. అంతర్జాతీయ క్రికెట్ లో క్వాలిటీ బౌలర్లు ఉంటారు కాబట్టి… వెంటనే అభిషేక్ శర్మకు సంబంధించిన వీక్నెస్ పట్టిస్తారని హెచ్చరించారు పాకిస్తాన్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్.

పాకిస్తాన్ ఓపెనర్ గా ఉన్న సైమ్ అయూబ్ తొలినాళ్ల‌లో ఇలాగే ఓవర్ గా బిహేవ్ చేశాడని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆఫ్ సైడ్ ఆడేందుకు తడబడుతున్నాడని సైమ్ అయూబ్ ( Saim Ayub) ను ఉద్దేశించి చురకలు అంటించారు అమీర్‌. అభిషేక్ శర్మ పరిస్థితి కూడా ఇలాగే ఉందని వ్యాఖ్యానించారు. కాబట్టి ఇకనైనా అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై ఫోకస్ చేయాలని కోరారు. సిక్సర్లు బౌండర్లే కాదు సింగిల్స్ కూడా తీయాలని సూచనలు చేశారు మహమ్మద్ అమీర్.

అభిషేక్ శర్మ మూడుసార్లు డక్ అవుట్

Advertisement

అభిషేక్ శర్మ మూడుసార్లు డక్ అవుట్ అయ్యాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో అభిషేక్ శర్మ మూడుసార్లు డక్ అవుట్ అయ్యాడు. యూఎస్ ఏ, పాకిస్తాన్‌, నెద‌ర్లాండ్స్ పై ఇలా అన్ని మ్యాచ్ ల‌లో డకౌట్ అయ్యాడు.

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×