E-Paper
Advertisement

Karate Kalyani: ఆ వెధవ అన్వేష్ గాడు.. ఇక బత్తాయి జ్యూస్ అమ్ముకోవడమే!

Karate Kalyani: ఆ వెధవ అన్వేష్ గాడు.. ఇక బత్తాయి జ్యూస్ అమ్ముకోవడమే!
Advertisement

Karate Kalyani: ఈ మధ్య నా అన్వేష్ (Naa Anvesh) భారతదేశంపై, హిందువులపై, దేవతలపై ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అన్వేష్‌పై కరాటే కళ్యాణి (Karate Kalyani) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన సిసిఎస్ పోలీసులు దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావించి, అతనిపై యాక్షన్ షురూ చేశారు. దీనిలో భాగంగా మొదట అతని ఇన్‌స్టాగ్రమ్‌పై చర్యలు తీసుకునేలా చేశారు. ప్రస్తుతం అతని ఇన్‌స్టా అకౌంట్ సెర్చ్‌లో లేకుండా పోయింది. ఈ విషయంలో తెలిసి కరాటే కళ్యాణి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. బిగ్ టీవీతో ఆమె మాట్లాడుతూ..

ఆయనకు థ్యాంక్స్

‘‘ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. హిందువులంతా పండగ చేసుకునే రోజు. ఒక వైపు శివాజీ మహారాజ్ జయంతి పండగలో అంతా ఉన్నారు. ఈ సమయంలో అన్వేష్ అకౌంట్ మొత్తం డిలీట్ అయ్యింది. ఈ విషయంలో పిటిషనర్ కృష్ణకాంత్‌ (Krishnakanth)కు ధన్యవాదాలు చెబుతున్నాను. ఆయన మొదటి నుంచి ఎంతో సపోర్ట్‌తో ఉన్నారు. ఇద్దరం కలిసి అన్వేష్‌పై ఫైట్ చేశాం. భారతదేశంపై వాడు ఘోరంగా మాట్లాడిన రోజు, నేను కేసు పెట్టిన సెక్షన్స్ చాలా చిన్నవని, తర్వాత చాలా వరకు ఈ విషయం వెళుతుందని అన్నారు. ఆ రోజు నుంచి అన్వేష్‌పై ఫైట్ చేస్తూనే ఉన్నాం. వాడి పాస్ పోర్ట్ సీజ్ చేయాలని, సజ్జనార్ దగ్గరకు వెళ్లేందుకు ఆయన అంతా రెడీ చేస్తున్నారు. వీటన్నింటికీ కృష్ణకాంత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Advertisement

Also Read- Big Tv Kissik Talks: మొహం మీదే చీదరింపులు.. అవమానాలు…పల్సర్ బైక్ రమణ ఎమోషనల్!

కొంచెం లేట్ అవ్వవచ్చేమో కానీ

సీతమ్మ తల్లిని, ద్రౌపది దేవిని, హిందువులును హీనంగా అవమానిస్తూ, దూషిస్తూ బత్తాయిలు అని అన్నాడో.., స్వామిజీలను, బీజేపీ లీడర్స్‌, మాలాంటి హిందుత్వ వాదులని.. అది, ఇది అని మాట్లాడాడో.. ఆరోజు చాలా బాధపడ్డాం. సీతమ్మ తల్లిని అని కూడా ఏమాత్రం పశ్చాత్తాప పడకుండా, మీరు ఇలాగే చూడండి.. నాకు 10 లక్షలు వచ్చాయి అని ఐఫోన్ చూపిస్తూ.. దానికి సీత అని పేరు పెట్టడం.. ఇవన్నీ నన్ను చాలా బాధపెట్టాయి. భారతదేశం గురించి గొప్పగా మాట్లాడాల్సిన చోట, దారుణంగా మాట్లాడాడు. ఉడతలు పట్టే ముఖం కాబట్టి.. పాస్‌పోర్ట్ విషయంలో ఇబ్బందులు ఫేస్ చేశాడు. అది చెప్పకుండా చెత్త పాస్ పోర్ట్ అని అవమానించడం ఎంత వరకు కరెక్ట్ రా వెధవన్నర వెధవ అని ఆరోజే చెప్పా. వాడికి రాసిపెట్టుకోమని కూడా చెప్పా. 2026లో నువ్వు చర్లపల్లి జైలుకి వస్తావ్, నిన్ను లాక్కొస్తాం.. భారతదేశానికి తిరిగి వస్తావ్. కొంచెం లేట్ అవ్వవచ్చేమో కానీ, కచ్చితంగా వస్తావ్ అని చెప్పా. ఇప్పుడు స్టార్టయింది. 1.3 మిలియన్స్‌కి పడిపోయిన ఇన్‌స్టా.. ఇప్పుడు పూర్తిగా జీరో అయ్యింది. ఇప్పుడు మా టార్గెట్ ఒక్కటే. వాడి యూట్యూబ్, పాస్‌పోర్ట్ సీజ్, బ్యాంక్ అకౌంట్ సీజ్. ఇవన్నీ చేస్తే.. వాడు ఎక్కడ ఉండి ఏం చేసుకున్నా.. ఎవరికీ తెలియదు. ఆ రోజు త్వరలోనే ఉంది.

Advertisement

Also Read- Prashanth Varma: ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

వాడు శిక్ష అనుభవించాలి

సీపీ సజ్జనార్ సార్ వాడిని హీరో అన్నారు ఒకప్పుడు. కానీ వాడి భాగోతం ఆయనకు కూడా తెలుసు కాబట్టి.. ఇప్పుడు ఇన్‌స్టా జీరో అయింది. ఆయనకు తెలియకుండా ఏమీ ఉండదు. వాడి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ తీయించేయాలని సీపీ సార్‌ని కలవబోతున్నాం. వాడికి డబ్బులు ఎప్పుడైతే రాకుండా పోతాయో.. అప్పుడు వాడికి దిమ్మతిరిగిపోయి, ఆరు కోట్లు ఖర్చయిపోయి, బుర్ర పిచ్చిక్కిపోయి, నా కర్మ కాలి.. నీ కంట్లో పడ్డానని ఆ రోజు అనుకుంటాడు వాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ అకౌంట్స్ కొనుక్కున్నా.. ఎన్ని రోజులు చేయగలడు. వాడు ఎన్నైనా చేసుకోనివ్వండి.. వాడు భారతదేశానికి తిరిగి రావాలి. దేశాన్ని తిట్టినందుకు వాడు శిక్ష అనుభవించాలి, అలాగే సీతా మాతను అన్నందుకు వాడు పక్కాగా అనుభవిస్తాడు. బత్తాయిలు బత్తాయిలు అంటూ ఏ విధంగా మాట్లాడాడో.. అదే బత్తాయి జ్యూస్ అమ్ముకుని బతుకుతాడు. అది కన్ఫామ్..’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

Also Read- 56 Days Thriller Series OTT : డవ్ కామెరూన్, అవాన్ జోగియా నటించిన థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి… 8 ఎపిసోడ్‌లలో పిచ్చెక్కించే ట్విస్టులు

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×