E-Paper
Advertisement

రివ్యూలపై మండిపడ్డ నిర్మాత.. పని గట్టుకొని మరీ బ్యాడ్ రివ్యూ!

రివ్యూలపై మండిపడ్డ నిర్మాత.. పని గట్టుకొని మరీ బ్యాడ్ రివ్యూ!
Advertisement

Tollywood:ఒక సినిమాకి రివ్యూ ఖచ్చితంగా అవసరమా అంటే.. అవసరం అనే చెప్పాలి. కాకపోతే ఈ రివ్యూలు నిజాయితీగా ఉంటే సినిమాను కాపాడవచ్చు. ఒకవేళ సినిమా బాగున్నా సరే కొంతమంది ఇచ్చే తప్పుడు రివ్యూల వల్ల ఆ సినిమా నిర్మాతలకు పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లుతోంది అనడంలో సందేహం లేదు . సాధారణంగా రివ్యూలు చూసే ఆడియన్స్ సినిమా థియేటర్ కి వస్తారు. ఒకవేళ రివ్యూ బాగోలేకపోతే అది ఎంత పెద్ద సినిమా అయినా.. స్టార్ నటీనటులైనా సరే డిజాస్టర్ గా నిలవక తప్పదు.కానీ కొంతమంది పని గట్టుకొని మరీ బాగున్న సినిమాలకు కూడా బాగోలేదని రివ్యూలు ఇచ్చి నాశనం చేస్తున్నారు అంటూ ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకసారి మరో నిర్మాత , దర్శకుడు తన బాధను అభిమానులతో పంచుకున్నారు.

రివ్యూలే సినిమా ప్రాణం తీస్తున్నాయా?

ఆయన ఎవరో కాదు అభిషేక్ నామ.. నిర్మాతగా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించి, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఈయన ‘డెవిల్’ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా విరాటకర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఈనెల మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా, తొలిరోజే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సినిమా రన్ టైం ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం అంటూ చాలామంది తమ రివ్యూలలో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై దర్శకుడు కం నిర్మాత అభిషేక్ నామ స్పందించారు.

Advertisement

ALSO READ:ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. ప్రత్యర్ధులుగా మారుతున్న రొమాంటిక్ కపుల్స్!

ఆవేదన వ్యక్తం చేస్తున్న దర్శకుడు..

అభిషేక్ నామా మాట్లాడుతూ.. జూలై 3వ తేదీన మా సినిమా థియేటర్లలో విడుదల అయితే.. జూలై 2వ తేదీనే మా సినిమాకి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా విడుదల కాకముందే రివ్యూలు ఎలా వస్తాయో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. సాధారణంగా నేను రివ్యూలను గౌరవిస్తాను. కానీ ఆ రివ్యూలలో ఎంత నిజం ఉందో కూడా తెలుసుకోవాలి. కామన్ ఆడియన్స్ అభిప్రాయాన్ని నమ్మడం చాలా మంచిది. సినిమా రమ్ టైం విషయంలో కూడా చాలామంది సూచనలు చేశారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఒక పాట అనవసరంగా ఉందని చెప్పడంతో దానిని కూడా తొలగించాము. ఇక క్లైమాక్స్ పెద్దగా ఉందని చెప్పడంతో దానిని కూడా ట్రిమ్ చేసాము.. సినిమా ఇప్పుడు మరింత బెటర్ గా వచ్చింది. అయినా సరే కావాలని కొంతమంది పని కట్టుకొని మరీ నెగటివ్ రివ్యూ ఇస్తున్నారు. నేను కొత్త దర్శకుడిని.. కొత్త హీరో, నిర్మాతలతో ఈ సినిమా చేశాను. దయచేసి మాలాంటి కొత్త వాళ్లను ప్రోత్సహించండి. థియేటర్ కు వెళ్లి సినిమా చూసి ఆ తర్వాతే మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీరు ఇచ్చే తప్పుడు రివ్యూల వల్ల మాలాంటి కొత్త వాళ్లకు నష్టం కలగడమే కాకుండా ఎంతో మంది కార్మికులకు తీరని నష్టాన్ని మిగులుస్తుంది. దయచేసి రివ్యూ ఇచ్చేవారు నిజాయితీగా సినిమా చూసిన తర్వాతే మీ అభిప్రాయాన్ని పంచుకోండి” అంటూ తెలిపారు అభిషేక్ నామ.

Related News

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్‌..వధువు ఎవరంటే? వీడియో వైరల్

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!

తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!

జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×