Sobhita Dhulipala:శోభితా దూళిపాళ్ల…పెళ్ళికి ముందు పలు సినిమాలు చేసినా ఈ భామ నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నాకే అక్కినేని వారి కోడలిగా ఫేమస్ అయిపొయింది.ఇక ఒకవైపు సినిమాల అప్ డేట్స్ ని షేర్ చేస్తూనే మరో వైపు పర్సనల్ విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఈ అందాల భామ తాజాగా మరో క్రేజీ పోస్ట్ తో అభిమానులని పలకరించింది.
తాజాగా ఆమెకు ‘స్టైల్ ఐకాన్’ అవార్డు రావడంతో ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ELLE Indiaకి థ్యాంక్స్ చెబుతూ తన స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
తన దృష్టిలో స్టైల్ అంటే
స్టైల్ అంటే కేవలం మంచి డ్రెస్సులు వేసుకోవడం, మేకప్ చేసుకోవడం మాత్రమే కాదని, తన దృష్టిలో స్టైల్ అంటే మన వ్యక్తిత్వాన్ని చూపించడం. చిన్నప్పుడు సినిమాలు, మ్యాగజైన్లు, మనకు నచ్చిన వాళ్లను చూసి వాళ్లలా ఉండాలని అనుకుంటామని చెప్పింది. కానీ వయసు పెరిగేకొద్దీ మన ఆలోచన మారుతుందని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
‘ఇది బాగుందా?’ అని ఆలోచించడం కంటే.. ‘ఇది నాకు సెట్ అవుతుందా? ఇది నిజంగా నన్ను చూపిస్తుందా?’ అని ఆలోచించడం మొదలవుతుందని తెలిపింది,అందుకే ఈ అవార్డు చాలా ప్రత్యేకమని పేర్కొంది.
సోషల్ మీడియాలో వైరల్
తన జర్నీని ఈ అవార్డు గుర్తించినట్టుగా భావిస్తున్నానని శోభిత చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక రెడ్ అండ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో శోభిత చాలా స్టైలిష్‌గా కనిపించడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్ .
ఇక సినిమాల విషయానికి వస్తే ‘రామన్ రాఘవ్ 2.0’తో సినిమాల్లోకి వచ్చిన శోభిత.. ఆ తర్వాత ‘గూఢచారి’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘మేజర్’ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించింది.
‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
అంతేకాదు.. ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ‘కురుప్’, ‘పొన్నియిన్ సెల్వన్’, ‘మంకీ మ్యాన్’, ‘లవ్, సితారా’ వంటి సినిమాల్లోనూ నటించింది. ముఖ్యంగా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాతో ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.
ఇక నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టింది. దీంతో ఆమె సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. అయితే శోభిత మాత్రం తన కెరీర్‌పై ఫోకస్ చేస్తూ వరుసగా సినిమాలు, ఫ్యాషన్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంటోంది.
‘స్టైల్ ఐకాన్’ అవార్డు రావడంతో
ఇప్పుడు ‘స్టైల్ ఐకాన్’ అవార్డు రావడంతో మరోసారి శోభిత పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ అవార్డు గురించి ఆమె చేసిన పోస్ట్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. మొత్తానికి హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న శోభిత.. ఇప్పుడు స్టైల్ విషయంలోనూ తనదైన ముద్ర వేస్తోంది.