E-Paper
Advertisement

BSNL ధమాకా ప్లాన్.. రూ.999కే ప్రతీ నెలా 5,000GB డేటా, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్లు!

BSNL ధమాకా ప్లాన్.. రూ.999కే ప్రతీ నెలా 5,000GB డేటా, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్లు!
Advertisement

BSNL 999 Plan: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారుల కోసం ఒక ఆకర్షణీయమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రోజురోజుకూ ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో.. తక్కువ ధరలోనే ఎక్కువ ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసేవారికి, రోజూ ఆన్‌లైన్ గేమింగ్ లేదా స్ట్రీమింగ్ చేసే కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

రూ.999 ప్లాన్ ప్రత్యేకతలు:

BSNL తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ కొత్త బిఎస్ఎన్ఎల్ ఫైబర్ (FTTH) ప్లాన్‌ను ప్రకటించింది. దీని నెలవారీ రుసుము రూ.999 కాగా.. దీనిలో నెలకు ఏకంగా 5,000GB వరకు డేటాను వాడుకోవచ్చు. అది కూడా ఏకంగా 200 mbps వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతాయి. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడుకునే సదుపాయం కూడా లభిస్తుంది.

Advertisement

Also Read: ఇది కదా అసలైన ఫోల్డబుల్ ఫోన్ అంటే.. శాంసంగ్‌ను మించిపోయేలా Xiaomi కొత్త ప్లాన్!

అనంతమైన వినోదం ఉచితం:

కేవలం హైస్పీడ్ ఇంటర్నెట్ మాత్రమే కాకుండా.. వినోదానికి కూడా ఈ ప్లాన్‌లో పెద్దపీట వేశారు. ఇందులో జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, హంగామా, షెమరూ వంటి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తున్నారు. వేర్వేరుగా ఓటీటీ ప్లాన్లు తీసుకునే అవసరం లేకుండా, ఒక్క రీఛార్జ్‌తో ఇంటర్నెట్‌తో పాటు వినోదాన్ని కూడా పొందే అవకాశం దీని ద్వారా దక్కుతుంది.

ఫ్రీడమ్ ఆఫర్‌తో అదనపు లబ్ధి:

Advertisement

ఇటీవలే BSNL తమ ఫైబర్ వినియోగదారుల కోసం ‘ఫ్రీడమ్ ఆఫర్’ పేరుతో మరో ప్రత్యేక ఆఫర్‌ను కూడా తెచ్చింది. సాధారణంగా రూ.199 విలువ చేసే ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను ఈ ఆఫర్ కింద కేవలం రూ.150కే అందిస్తోంది. దీని ద్వారా సోనీ లివ్, జీ5, జియో హాట్‌స్టార్ సేవలను తక్కువ ధరకు పొందే వీలుంది.

తక్కువ ధరకే కొత్త సిమ్:

మరోవైపు కొత్తగా BSNL నెట్‌వర్క్‌లోకి మారాలనుకునే వారి కోసం రూ.51 సిమ్ ఆఫర్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఈ ప్లాన్ కింద రూ.51కే కొత్త సిమ్ కార్డు లభిస్తుంది. ఇందులో 30 రోజుల వ్యాలిడిటీతో రోజూ 2GB డేటా, రోజుకు 100 SMSలు, అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తాయి.

Also Read: బాస్కెట్‌బాల్ లవర్స్‌ కోసం Pixel Watch 5.. కొత్త ఎడిషన్ గ్యాడ్జెట్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందా?

Related News

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

Big Stories

Advertisement
×