BigTV English

Ramayan: రామాయణ గ్లింప్స్.. ప్రభాస్ డైరెక్టర్ చావుకొచ్చిందే.. జీవితకాలం విమర్శలు తప్పవా?

Ramayan: రామాయణ గ్లింప్స్.. ప్రభాస్ డైరెక్టర్ చావుకొచ్చిందే.. జీవితకాలం విమర్శలు తప్పవా?

Ramayan: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో మైథాలజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇలాంటి సినిమాల ద్వారా ఈ తరం వారికి మన పురాణ ఇతిహాసాల గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే రామాయణం గురించి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. త్వరలోనే మరొక అద్భుతమైన కథతో రామాయణం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు నితీష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సాయి పల్లవి(Sai Pallavi) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “రామాయణ”(Ramayan).


ఓం రౌత్ పై విమర్శలు…

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి పాత్రల పేర్లను పరిచయం చేస్తూ ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రభాస్(Prabhas) దర్శకుడు ఓం రౌత్ (Om Rauth)పట్ల భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈయన కూడా ప్రభాస్ హీరోగా ఆది పురుష్(Adipurush) అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా రామాయణం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


నిరాశపరిచిన ఆది పురుష్…

ఇకపోతే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి అలాగే విఎఫ్ ఎక్స్ కూడా ఏమాత్రం బాగా లేకపోవడంతో ప్రభాస్ సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రభాస్ సినీ కెరియర్ లోనే ఈ సినిమా ఎన్నో విమర్శలను ఎదుర్కొందని చెప్పాలి. ఇకపోతే తాజాగా రామాయణ సినిమాకు సంబంధించిన ఈ వీడియోలో విఎఫ్ ఎక్స్ ఎంతో అద్భుతంగా ఉంది. అద్భుతమైన బీజీఎం, రాముడిగా రణబీర్ లుక్స్ కూడా ఎంతో అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

రావణాసురుడిగా యశ్

ఈ నేపథ్యంలోనే ఓం రౌత్ పై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెరపై రాముడిని చూపించే విధానం అంటే ఇది ఇప్పుడైనా సినిమా ఎలా చేయాలో చూసి నేర్చుకో అంటూ ప్రభాస్ అభిమానులు మరోసారి ఈయనని ఏకిపారేస్తున్నారు. అయితే ఆది పురుష్ సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ కూడా ప్రభాస్ అభిమానులకు కోపం మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇలా అవకాశం వచ్చిన ప్రతిసారి డైరెక్టర్ ఓం రౌత్ పై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు.. ఇక రామాయణ విషయానికి వస్తే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇందులో సాయి పల్లవి సీత పాత్రలో నటించగా, కే జి ఎఫ్ నటుడు యష్ (Yash)రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు.

Also Read: Piracy crackdown: సైబర్ క్రైమ్ వలలో పైరసీ కింగ్.. ఆరు నెలల్లో 60 సినిమాలు .. కోట్లలో నష్టాలు!

Related News

Dadasaheb Phalke Biopic: ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఆగిపోయినట్టేనా.. జక్కన్న కీలక నిర్ణయం!

Kantara Movie: కాంతార: చాప్టర్‌ 1 విలన్‌కి డబ్బింగ్‌ చెప్పింది ఈ బిగ్‌బాస్‌ కంటెస్టెంటే.. తెలుసా?

Srinidhi shetty: ఆ ఇద్దరి హీరోల కోసం రాత్రి పగలు ఆ పని చేస్తా.. శ్రీనిధి శెట్టి

DVV Danayya : పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్… దానయ్య దారెటు ?

Rishabh shetty: కాంతార1 లో రిషబ్ శెట్టి భార్య పిల్లలు కూడా ఉన్నారా…అసలు కనిపెట్టలేరుగా?

Naga Chaitanya: నాన్నలాగే అలాంటి సినిమాలు చేయాలి.. అదే నా కల

Bad Boy Karthik Teaser: బ్యాడ్ బాయ్ అని చెప్పారు.. కానీ స్మార్ట్ బాయ్ లా ఉన్నావ్

Mass Jathara: హుడియో హుడియో.. ఏముందిరా బాబు శ్రీలీల

Big Stories

×