Ganesh Nimajjanam: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఒక ఘనమైన వేడుక. దీనిని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. 71 ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో “శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి” రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఈ విగ్రహం, హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లతో ముందుకు వెళుతుంది.
గణేశ్ శోభయాత్రకు
ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర శనివారం ఉదయం 6 గంటలకు మండపం నుంచి ప్రారంభమైంది. ఈ శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, ఇక్బాల్ మినార్, సైఫాబాద్ ఓల్డ్ పోలీస్ స్టేషన్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియేట్ మీదుగా ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న క్రేన్ నంబర్ 4 వద్ద ముగిసింది. విగ్రహాన్ని విజయవాడ నుంచి తీసుకొచ్చిన 26 చక్రాలు, 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు గల 200 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ టస్కర్ ట్రాలీపై తరలించారు. 50 టన్నుల బరువు గల ఈ విగ్రహాన్ని సురక్షితంగా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయడానికి 100 టన్నుల సామర్థ్యం గల హైడ్రాలిక్ టెలిస్కోపిక్ బూమ్ క్రేన్‌ను ఉపయోగించారు. శుక్రవారం అర్ధరాత్రి కలశపూజ నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభించారు. అబిడ్స్‌కు చెందిన పూల కళాకారులు టస్కర్‌ను అందంగా అలంకరించారు.
శోభయాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు..
ఈ భారీ శోభాయాత్ర కోసం హైదరాబాద్ పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఓల్డ్ సిటీతో సహా సమస్యాత్మక ప్రాంతాల్లో 200 మంది పోలీసులు, కేంద్ర బలగాలు, రోప్ పార్టీ, టాస్క్ ఫోర్స్, ట్రాఫిక్ పోలీసులు మోహరించారు. ఐదు డ్రోన్లతో పర్యవేక్షణ, సీసీటీవీ కెమెరాలు, జాయింట్ కంట్రోల్ సెంటర్లు, క్యూఆర్ కోడ్ స్టిక్కర్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో కంట్రోల్ రూమ్‌లు స్థాపించారు. ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు లారీలపై ఆంక్షలు విధించారు. భక్తుల సౌలభ్యం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు, ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ ఆలయం, ఖైరతాబాద్ ఎంఎంటిఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
Also Read: నా జానే జిగర్ మోదీ! వెనక్కి తగ్గిన ట్రంప్..
ముగిసిన నిమజ్జనం..
ఎట్టకేలకు 11 రోజులు ఎంతో నిష్టగా పూజలందుకున్న ఖైరతాబాద్ గణేశుడు ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. శనివారం మధ్యాహ్నం 1:20 నుంచి 1:45 సమయంలో గణనాథుడు నిమజ్జన వేడుకలు ముగిసాయి. గణనాథుడిని తీసుకువచ్చినప్పుడు ఎంతో ఇష్టంగా సంతోషంగా తీసుకోస్తారు. కానీ నిమజ్జనం సమయంలో ఎంతో బాధగా గంగమ్మ ఒడికి చేర్చుతారు. ఇంకా చిన్న పిల్లలు అయితే అప్పుడే వెళ్లిపోతున్నావా గణేశా అంటూ.. ఏడుస్తూనే ఉంటారు . ఎలా అయితే నే గణనాథుడు గంగమ్మ ఒడికి సురక్షితంగా చేరుకున్నాడు.