Sukumar:సుకుమార్ (Sukumar),అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న (Rashmika Mandanna)..ఈ ముగ్గురిని ఒకేసారి పాన్ ఇండియా స్టార్స్ ని చేసిన చిత్రం పుష్ప. సాధారణ సినిమాగా తెరకెక్కిన పుష్ప సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. పుష్ప సినిమాకి వచ్చిన ఆదరణతో పుష్ప-2 సినిమాని మరింత అంచనాలు పెంచేలా తెరకెక్కించారు డైరెక్టర్ సుకుమార్. సినిమా స్టోరీకి తగ్గట్టే నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ ని పెట్టి సినిమాను వేరే లెవెల్ లో ప్రమోట్ చేశారు. అలా మొత్తానికి పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పటివరకు సాధించని ఎన్నో సంచలనాలు కూడా సృష్టించింది.
ఎందుకంటే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. అలా మొదటి పార్ట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో రెండో పార్ట్ ని కూడా భారీ అంచనాలతో తెరకెక్కించారు.ఎన్నో అంచనాలతో వచ్చిన పుష్ప-2 సినిమా కూడా బాక్సాఫీస్ షేక్ చేసింది. ముఖ్యంగా ఇండియన్ సినీ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా.. బాహుబలి రికార్డులను సైతం కొళ్లగొట్టి పుష్ప -2 రెండో ప్లేస్ లో నిలిచింది. అలా పుష్ప-2 విడుదలకాక ముందు మొదటి స్థానంలో దంగల్, రెండవ స్థానంలో బాహుబలి 2 ఉండేవి. కానీ బాహుబలి 2 కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టి పుష్ప -2 సెకండ్ ప్లేస్ కి వచ్చేసింది.
రికార్డులే కాదు దెబ్బకు జైలుకు వెళ్లిన బన్నీ..
పుష్ప సినిమా ఎన్ని సంచలనాలను సృష్టించిందో అన్ని చిక్కులో పడింది. ఎందుకంటే ఈ సినిమా విడుదలైన సమయంలో అల్లు అర్జున్ హైదరాబాదులోని సంధ్య థియేటర్ కి వెళ్లడం,అక్కడ తొక్కిసలాట జరగడం,ఒక మహిళ మృతి చెందడం, ఆ మహిళ కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఇలా ఎన్నో జరిగాయి. ఆఖరికి అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఒకరోజు అల్లు అర్జున్ జైలు లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు.అలా మొత్తంగా ఒక సినిమాలాగే ఈ తతంగం మొత్తం నడిచింది.
ALSO READ:Little hearts Collections : లిటిల్ హార్ట్స్‌కు బిగ్ షాక్… పాజిటివ్ టాక్ వచ్చినా తక్కువ కలెక్షన్లే
పుష్ప 3 పై డైరెక్టర్ కామెంట్..
ఇదంతా పక్కన పెడితే.. పుష్ప-2 సినిమాకి సీక్వెల్ గా పుష్ప-3 కూడా ఉంటుందని సినిమా చివర్లోనే హింట్ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్.. అయితే తాజాగా పుష్ప-3 కి సంబంధించి ఒక మంచి అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్.. రీసెంట్ గా సైమా అవార్డ్స్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సైమా అవార్డ్స్ లో పుష్ప-2 సినిమా సత్తా చాటింది.బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్.. బెస్ట్ యాక్ట్రెస్ గా రష్మిక.. బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ఇలా పుష్ప-2 సినిమా సైమా అవార్డ్స్ లో సత్తా చాటింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న వీళ్ళందరూ అవార్డ్స్ తీసుకుంటుండగా సుధీర్ పార్టీ లేదా పుష్పా అంటూ అడిగారు.
దుబాయ్ వేదికగా పుష్ప 3 ర్యాంపేజ్ అనౌన్స్..
అలాగే మరో లేడీ యాంకర్ అవన్నీ కాదు సార్ పుష్ప-3 ర్యాంపేజ్ ఉంటుందా? లేదా? అని ప్రశ్నించగా.. కచ్చితంగా ఉంటుంది అంటూ సుకుమార్ ఆన్సర్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు పుష్ప-3 ర్యాంపేజ్ పై సుకుమార్ అదిరిపోయే అప్డేట్ అంటూ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు.అయితే పుష్ప-3 తెరకెక్కడానికి మరో రెండు మూడు సంవత్సరాల సమయం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ కి, సుకుమార్ కి వేరే సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి వీరి కాంబోలో రాబోయే పుష్ప-3 మూవీ కోసం మరికొద్ది సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.
Pushpa 3 Rampage will Be There For Sure ✨️🔥@alluarjun @iamRashmika pic.twitter.com/N5OoQyr4eD
— North Icons (@NorthAlluFans) September 6, 2025