E-Paper
Advertisement

లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ సినిమాపై బిగ్ అప్డేట్.. ఆ వార్తలకు చెక్ పెట్టారుగా!

లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ సినిమాపై బిగ్ అప్డేట్.. ఆ వార్తలకు చెక్ పెట్టారుగా!
Advertisement

Allu Arjun -AA23 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో రాకా సినిమా(Raaka) షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు పూర్తి కావచ్చాయని సమాచారం. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే అల్లు అర్జున్ తన 23వ సినిమా అని ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kangaraj) దర్శకత్వంలో చేయబోతున్న విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ఇలా ఈ సినిమా ప్రకటించినప్పటికీ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ లోకేష్ కనకరాజు సీరియస్ డిస్కషన్..

గత రెండు రోజులుగా అల్లు అర్జున్ లోకేష్ సినిమా రద్దయింది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ సినిమా సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ అల్లు అర్జున్ కు పెద్దగా నచ్చకపోవడంతో స్క్రిప్ట్ సరి చేయమని సూచనలు వచ్చాయి అని కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈ సినిమా షూటింగు గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ తెలియజేశారు. లోకేష్ తో పాటు అల్లు అర్జున్ మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతున్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

కమింగ్ సూన్ అంటున్న లోకేష్ కనగరాజ్..

Advertisement

ఈ ఫోటోని షేర్ చేసిన లోకేష్ కనగరాజ్ త్వరలోనే బిగ్ అప్డేట్ రాబోతుందంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్నటువంటి వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. మరోవైపు మైత్రి నిర్మాతలు సైతం ఈ సినిమా పూజ ముహూర్తానికి సమయం ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతోందని సమాచారం. మరి ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్ త్వరలోనే ఇవ్వబోతున్నారా లేదా మరేదైనా అప్డేట్ ఉండబోతుందా అంటూ అభిమానులు ఆత్రుత కనబరుస్తున్నారు.

Advertisement

ఇలా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ రాబోతుందనే విషయం తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్ ఇదివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంఘటన తెలిసిందే. ఈ సినిమాతో పాటు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అయితే అల్లు అర్జున్ తో సినిమా పూర్తి అయిన తర్వాతనే ఇతర సినిమా పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఈయన దర్శకుడుగా తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ తో లోకేష్ చేయబోయే సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

Also Read: వాళ్లని చూస్తే కంకర రాళ్లతో కొట్టాలనిపిస్తుంది…చిరు పై మహేష్ అచంట వైరల్ కామెంట్స్

Related News

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీకాంత్ కుమార్తె మేధా… పూర్తి డీటెయిల్స్ ఇవే!

స్నిగ్ధ లెస్బియనా కాదా? చివరకు అసలు విషయం చెప్పేసిందిగా!

బాలయ్య ఇల్లు కూల్చివేత.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగు

నేను బ్రతికున్నంత వరకు నీ ఆత్మ నరకం అనుభవించాలి – తనుశ్రీ

పెళ్లి వద్దు.. పిల్లలు ముద్దు.. నరేష్ ఊహించని కామెంట్!

చిరంజీవి మూవీని వదులుకున్న బాలయ్య కూతురు!

తెరపై పద్ధతిగా.. నెట్టింట స్టైలిష్‌గా.. సురేఖా వాణి రూటే సెపరేటు!

Big Stories

Advertisement
×