E-Paper
Advertisement

వాళ్లని చూస్తే కంకర రాళ్లతో కొట్టాలనిపిస్తుంది…చిరు పై మహేష్ అచంట వైరల్ కామెంట్స్

వాళ్లని చూస్తే కంకర రాళ్లతో కొట్టాలనిపిస్తుంది…చిరు పై మహేష్ అచంట వైరల్ కామెంట్స్
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొంటూ వారికి సంబంధించిన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో భాగంగా సినీ నటుడు మహేష్ అచంట(Mahesh Achanta) పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమం ప్రసారమైంది అయితే ఇందులో ఈయన తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు గురించి అలాగే టాలీవుడ్ హీరోల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో..

సాధారణంగా ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా వారికంటూ ఇష్టమైన సెలబ్రిటీలు ఉంటారు ఈ నేపథ్యంలోనే మహేష్ అచంటకు ఏ హీరో అంటే ఇష్టం అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు మహేష్ సమాధానం చెప్పు నాకు చిరంజీవి(Chiranjeevi) గారు అంటే చాలా ఇష్టం అని తెలిపారు. చిరంజీవి గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది అంటూ ప్రశ్న ఎదురవడంతో.. మొదటిసారి తాను సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్లో భాగంగా చిరంజీవి గారిని చూసానని తెలిపారు. అయితే ఆరోజు నేను చిరంజీవి గారి వద్దకు వెళ్లి తనతో కలిసి ఒక ఫోటో దిగానని తెలిపారు. ఈ సినిమా తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమా సమయంలో చిరంజీవి గారు నన్ను చూసి నన్ను దగ్గరకు పిలిచారు.

నా కళ్ళల్లోకి చూసి చిరంజీవి గారు ఏడవాలి..

Advertisement

ఇలా దగ్గరికి పిలిచిన చిరంజీవి నువ్వు మాట్లాడే స్లాంగ్ చాలా బాగుంటుంది రా అంటూ చెప్పారని మహేష్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో డ్రైనేజీ క్లీన్ చేసే సమయంలో అమ్మ నేను ఈ పని చేసుకోలేకపోతున్నాను ఊరికి వస్తాను అంటూ చెప్పే ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. అయితే ఆ డైలాగ్ సమయంలో చిరంజీవి గారు నా కళ్ళల్లోకి చూసి నా బాధను అర్థం చేసుకొని ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవాల్సిన సన్నివేశం అది. చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసేటప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు వస్తే నాకు నచ్చేది కాదని మహేష్ తెలిపారు.

Advertisement

ఇలా చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయన కళ్ళల్లో నీళ్లు కనుక చూస్తే ఆయనని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంకర రాళ్లు తీసుకొని కొట్టాలనే చిరాకు వచ్చేదని మహేష్ తెలిపారు. ఇలా చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలకు అంతలా కనెక్ట్ అయిన నేను ఇప్పుడు సినిమాలలో నన్ను చూసి ఆయన ఏడ్చడం అనేది మర్చిపోలేని విషయమని తెలిపారు. ఇక రంగస్థలం సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత మొదటిసారి చిరంజీవి గారు చూసి ఈ సినిమా ద్వారా నీకు చాలా మంచి పేరు వస్తుంది రా అంటూ చెప్పారు. ఆయన చెప్పారు అంటే మనకు తిరుగుండదు. ఇక రంగస్థలం సినిమా నుంచి చిరంజీవి గారు నన్ను చాలా బాగా ఆప్యాయంగా చూసుకుంటారంటూ మహేష్ అచంట చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read:జబర్దస్త్ కార్యక్రమం పై మహేష్ అచంట కామెంట్స్.. రెండు రోజులు పని చేస్తే చాలంటూ!

Related News

చేతిలో రూపాయి లేదు.. శివుడిని మొక్కగానే సినిమా ఛాన్స్.. మహేష్ అచంట ఓపెన్ టాక్!

బిగ్‌బాస్ టైటిల్ అతను గెలిస్తే హ్యాపీ.. మహేష్ అచంట మనసులో మాట!

ఆరుగురిని లవ్ చేశా.. నా భార్యకు చెబితే .. మహేష్ అచంట లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా?

బిగ్‌బాస్‌కు వెళ్లకపోవడానికి కారణం ఇదేనా? మహేష్ అచంట ఏమన్నారంటే!

వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్.. హౌస్ లోకి అడుగుపెట్టిన స్టార్స్ వీరే!

జబర్దస్త్ కార్యక్రమం పై మహేష్ అచంట కామెంట్స్.. రెండు రోజులు పని చేస్తే చాలంటూ!

నా డైలాగ్స్ అంటే మహేష్ బాబుకి పిచ్చ ఇష్టం.. రంగస్థలం మహేష్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×