Lokesh Kanagaraj: ఒకప్పుడు దర్శకులకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం దర్శకుడిని బట్టి సినిమాకు వెళ్లే ఆడియన్స్ ఉన్నారు. ఒక సినిమా తీసి సక్సెస్ అయితే చాలు తర్వాత ఆ దర్శకుడు వర్క్ ని చాలా మంది గమనిస్తూ ఉంటారు. అలా తన పనితో మంచి గుర్తింపు సాధించుకున్న దర్శకులలో ఒకడు లోకేష్ కనగరాజ్.
మా నగరం సినిమాతో ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఒక రెండేళ్ల వరకు ఏ సినిమా చేయలేదు. కార్తి హీరోగా వచ్చిన ఖైదీ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అక్కడితో లోకేష్ కి దర్శకుడిగా ఒక బ్రాండ్ పడిపోయింది.
లోకేష్ ను పిలిచిన రజనీకాంత్
మా నగరం సినిమా హిట్ అయిన తర్వాత మంచి దర్శకుడు అనే ఒపీనియన్ రజనీకాంత్ కి వచ్చేసింది. ఆ తర్వాత ఖైదీ అనే సినిమా బాగా ఆడుతుంది అని రజనీకాంత్ కి వినిపించిందట. వెంటనే దర్శకుడు ఎవరు అని ఆరా తీయగానే లోకేష్ కనగరాజ్ అని తెలిసింది. వెంటనే రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ పిలిచారు. నాకు చెప్పడానికి నీ దగ్గర ఏమైనా కథ ఉందా అని అడిగారట. వెంటనే నా దగ్గర కథ ఉంది అని చెప్పారట లోకేష్. కథ చెప్పడానికంటే ముందు సర్ నేను కమల్ హాసన్ ఫ్యాన్ అని చెప్పారట. అయితే మొత్తానికి లోకేష్ ఒక కథను చెప్పాడు. సెకండ్ ఆఫ్ అడిగినప్పుడు కొంచెం టైం కావాలి అని చెప్పారట.
లోకేష్ కథ చెప్పిన వెంటనే కమల్ హాసన్ రజినీకాంత్ కి ఫోన్ చేసి నాకు 40 డేస్ తనతో పని ఉంది అని అన్నారట. అప్పుడు వీరి కాంబినేషన్లో విక్రమ్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా జరుగుతూనే ఉంది. సినిమా అయిపోయిన తర్వాత రజనీకాంత్ కి కథ చెప్పారట లోకేష్. ఈ కథ కోసం చాలా పెద్ద పెద్ద నటులు కావాల్సి వస్తుందని అప్పుడే చెప్పారట.
కూలీ తో భారీ మోసం
వాస్తవానికి లోకేష్ రజినీకాంత్ కి కథ చెప్పినప్పుడు మీ ముందు సినిమాలలో దీంట్లో ఎలివేషన్స్ అవి ఉండవు. దీనిలో ఒక ఇంటిలిజెంట్ పర్ఫామెన్స్ కావాలి అని ముందే చెప్పారట. చెప్పిన మాదిరిగానే కూలీ సినిమా చేశాడు లోకేష్. కానీ లోకేష్ రజనీకాంత్ ను సరిగా వాడుకోలేదు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. సరిగ్గా ఎలివేషన్ చూపించలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. కమల్ హాసన్ కి మంచి సినిమా ఇచ్చాడు, అలానే విజయ్ కు కూడా మంచి సినిమా ఇచ్చాడు. అని రజనీకాంత్ ని సక్సెస్ఫుల్ గా మోసం చేశాడు. అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
Also Read: Nagarjuna : నేను యాక్టర్ అవుతా అంటే, మా నాన్న ఏడ్చారు