Indian Railways Round Trip Scheme: ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రౌంట్ ట్రిప్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి టికెట్ కొనుగోలుపై ఏకంగా 20 శాతం రాయితీ అందిస్తోంది. ఇందుకోసం రౌండ్ ట్రిప్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ స్కీమ్ కింద టికెట్ల బుకింగ్ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. దీపావళి, ఛాత్ పూజ మొదలైన పండుగలు రానున్న నేపథ్యంలో ఈ పథకాన్నిఅమలు చేయబోతోంది. ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ’ కింద టికెట్ల కొనుగోలుపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు 13 అక్టోబర్ నుంచి 26 అక్టోబర్ 2025 మధ్య వెళ్లేందుకు, ఆ తర్వాత నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1, 2025 మధ్య తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
భారతీయ రైల్వే రౌండ్ ట్రిప్ టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే?
భారతీయ రైల్వే రౌండ్ ట్రిప్ టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలనేది.. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ వెళ్లేందుకు ప్రయాణ తేదీలు: 13 అక్టోబర్ – 26 అక్టోబర్ 2025 మధ్య బోర్డింగ్ స్టేషన్ నుంచి వెళ్లే టికెట్లు బుక్ చేసుకోవాలి.
⦿ ఈ టికెట్లను IRCTCలోని ‘ఫెస్టివల్ రౌండ్ ట్రిప్ స్కీమ్’ సబ్ మెనూ నుంచి బుక్ చేసుకోవచ్చు.
⦿ ముందుగా రైల్వే అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. మెయిన్ నావిగేషన్ బార్ నుండి ‘రైళ్లు’, ‘ఫెస్టివల్ రౌండ్ ట్రిప్ స్కీమ్’ను ఎంచుకోవాలి.
⦿ ఆ తర్వాత కొనసాగించు అనే బటన్ పై క్లిక్ చేయాలి.
⦿ మీరు ఎక్కే స్టేషన్ నుంచి ప్రయాణ తేదీ, తరగతిని ఎంచుకోవాలి. ఆ తర్వాత బుకింగ్ కొనసాగండి అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
⦿ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, వినియోగదారులకు బుకింగ్ నిర్ధారణ పేజీతో కూడిన PNR వివరాలతో అందించబడుతుంది.
⦿బుకింగ్ నిర్ధారణ పేజీలో ‘రిటర్న్ టికెట్‌ను బుక్ చేయండి (20% డిస్కౌంట్)’ బటన్ ను క్లిక్ చేయాలి.
⦿ తిరుగు ప్రయాణ ప్రయాణ తేదీలు 17 నవంబర్ – 1 డిసెంబర్ 2025 వరకు ఉండాలి.
⦿ తిరుగు ప్రయాణ బుకింగ్‌ను బుకింగ్ కన్ఫర్మేషన్ పేజీలోని ‘రిటర్న్ టికెట్ బుక్ (20% డిస్కౌంట్)’ బటన్ నొక్కాలి.
⦿ మీరు బయల్దేరాల్సిన స్టేషన్ ను ఎంపిక చేసుకోవాలి. తరగతి సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ కొట్టాలి. వెళ్లే టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో రిటర్న్ టికెట్ కూడా అలాగే బుక్ చేసుకోవాలి.
⦿ చెల్లింపు తర్వాత, రిటర్న్ జర్నీ టికెట్ బుక్ చేయబడుతుంది.
ఫెస్టివల్ రౌండ్ ట్రిప్ పథకం కింద బుక్ చేసుకున్న టిక్కెట్ల కోసం, ఆన్ వర్డ్/రిటర్న్ జర్నీERS ప్రయాణంలోని మరొక దశ PNRను కూడా అందిస్తుంది.
Read Also: దేశంలో వింతైన రైల్వే స్టేషన్లు, రైల్వే మార్గాలు.. వీటి గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే!