Indigo Flight: విమానాల్లో సాంకేతిక లోపాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. విమానం ల్యాండ్ అయ్యే వరకు ప్రాణాలతో ఉంటామనే ఆశ వదులుకుని విమాన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తాజా ఇండిగో విమానం సాంకేతిక కారణం వల్ల ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
కొచ్చి నుండి అబుదాబికి 6E-1403 ఇండిగో విమానం బయలుదేరింది. సమయం శుక్రవారం రాత్రి 11.10, 180 మంది పైగా ప్రయాణికులు, ఆరు మంది క్రూ సభ్యులు ఉన్నారు. సేఫ్ గానే బయలుదేరిన విమానం గాల్లోనే తిరుగుతూనే ఉంది. సుమారు రెండు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాణిలకు ఏంచేయాలో కాసేపు అర్థం కాలేదు. అయితే విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు విమానం ల్యాండ్ చేసేందుకు అనుమతించారు. కానీ ల్యాండ్ చేసేందుకు కూడా సమయం పట్టడంతో ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, విమానం సేఫ్ గానే ల్యాండ్ అవుతుందని సూచించారు. దీంతో ప్రయాణికులు భయంతో బిక్కు బిక్కు మంటూ చేసేదేమి లేక కూర్చుండి పోయారు.
Also Read: Flax seeds: అవిసె గింజల నూనెతో ఇలా కూడా చేస్తారా! ఉపయోగం ఏమిటి?
పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని కాసేపు గాల్లోనే తిరుగుతూ అర్ధరాత్రి 1.44 నిమిషాలకు కొచ్చి విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ చేశాడు. దీంతో ఎవరికి ఎలాంటి హానీ జరగక పోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మరో విమానంలో తెల్లవారుజామున 3.30గంటలకు అబుదాబీకి తీసుకెళ్లారు. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇండోర్‌లో మరొఘటన
రాజధాని ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఇంజిన్‌లో లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. పైలెట్ ఇంజిల్ పనిచేయకపోవడంతో వెంటనే గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు విమానం ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో పైలెట్ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.