E-Paper
Advertisement

వారణాసి కోసం సందీప్ కీలక నిర్ణయం.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

వారణాసి కోసం సందీప్ కీలక నిర్ణయం.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
Advertisement

Sandeep Reddy vangaటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలుపెట్టి.. ఒక్కో సినిమాతో తనలోని టాలెంట్ ను నిరూపించుకుంటూ.. టాలీవుడ్ లో ఓటమెరుగని దర్శకుడిగా పేరు సంపాదించారు రాజమౌళి (Rajamouli).. బాహుబలి(Bahubali ) సినిమాతో పాన్ ఇండియా సినిమాకు తెరలేపిన ఈయన.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా తెలుగు సినిమాని ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిపించి.. ప్రపంచ దృష్టిని సారించారు. ఇప్పుడు మహేష్ బాబు(Mahesh Babu)తో వారణాసి(Varanasi ) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విదేశాలలో షూటింగ్ చేస్తూ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న వారణాసి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం స్పిరిట్ (Spirit ) మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కేవలం 32 రోజుల వ్యవధిలో వారణాసి – స్పిరిట్..

విషయంలోకి వెళ్తే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్(Prabhas ) హీరోగా నటిస్తున్న చిత్రం స్పిరిట్. అటు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన చిత్రం వారణాసి . ఈ రెండు చిత్రాలు వచ్చే యేడాది కేవలం నెల రోజుల వ్యవధిలో విడుదల కానున్నాయి. పైగా బాక్సాఫీస్ వద్ద ఇవి రెండు సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో నెలరోజుల వ్యవధిలో ఈ రెండు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో.. రెండు భారీ చిత్రాల మధ్య నాలుగు వారాల గ్యాప్ సరిపోతుందా ? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో మెదులుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రెండు భారీ సినిమాల రిలీజ్ గ్యాప్ పై సందీప్ రెడ్డివంగా తాజాగా రోమాంచికం మూవీ ఈవెంట్లో స్పందించారు.

అవసరమైతే స్పిరిట్ మూవీని వాయిదా వేసుకుంటాం – సందీప్

Advertisement

సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ..” రాజమౌళి దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నా డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీని వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేము అనౌన్స్ చేసాము. అయితే నెల రోజుల గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం సమస్య ఏమి కాదు. స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్ద సినిమా అయినప్పటికీ రెండు సినిమాల మధ్య గ్యాప్ సరిపోతుంది. అవసరమైతే వారణాసి కోసం స్పిరిట్ మూవీని వాయిదా వేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం” అంటూ ఆయన స్పష్టం చేశారు. నిజానికి స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్దది.. రెండు సినిమాల మధ్య 32 రోజుల గ్యాప్ ఉంది . ఒకవేళ ఆ గ్యాప్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అవసరమైతే మేము మా సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

also read:పవన్, రీతూ చౌదరి జంటకి అవమానం.. శ్రీముఖిపై నెటిజన్స్ ఫైర్!

మరో 65 రోజుల్లో స్పిరిట్ షూటింగ్ కంప్లీట్ – సందీప్

Advertisement

అంతేకాదు అదే సమయంలో స్పిరిట్ మూవీని చెప్పిన డేట్ కి కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. సందీప్ మాట్లాడుతూ.. 45 రోజుల షూటింగ్ కంప్లీట్ అయింది . ఇంకో 65 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. త్వరగా ఫినిష్ చేసి అనుకున్న డేట్ కి సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం” అంటూ తెలిపారు. ఏది ఏమైనా వారణాసి కోసం తాము తప్పుకుంటాం అంటూ సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి సందీప్ చేసిన కామెంట్లు ఓకే.. దీనికోసం ప్రభాస్ అభిమానులు ఒప్పుకుంటారా అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×