E-Paper
Advertisement

అందరి చూపు ఆమె వైపే.. గీతూ గట్టెక్కుతారా? ‘టాక్సిక్’తో ఆ జాబితాలోకి చేరతారా?

అందరి చూపు ఆమె వైపే.. గీతూ గట్టెక్కుతారా? ‘టాక్సిక్’తో ఆ జాబితాలోకి చేరతారా?
Advertisement

వందల కోట్ల బడ్జెట్.. పాన్ ఇండియా స్టార్ యశ్.. భారీ యాక్షన్ ఎలిమెంట్స్.. ఇంటర్నేషనల్ లెవల్ మేకింగ్.. ఇదే టాక్సిక్. కానీ.. ఈ సినిమాలో హీరో యశ్ మాత్రమే కాదు.. మరో హైలైట్ కూడా ఉంది.. అదే డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్.

సాధారణంగా భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలంటే.. మేల్ డైరెక్టర్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి.. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ.. ఓ మహిళా దర్శకురాలు ఏకంగా వందల కోట్ల సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

టాక్సిక్ బడ్జెట్‌పై అధికారికంగా ఒక్క ఫిగర్‌ను ప్రొడ్యూసర్స్ చెప్పకపోయినా.. సుమారు 600 కోట్ల రూపాయలకు పైబడిన బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇంత భారీ స్థాయి ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్న గీతూ మోహన్‌దాస్.. గతంలో ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్, ఇండిపెండెంట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి దర్శకురాలు ఇప్పుడు.. యశ్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో.. భారీ కమర్షియల్ యాక్షన్ సినిమాను తెరకెక్కించడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది.

భారతీయ సినిమా స్థాయిలో.. ఇప్పటివరకు మహిళా దర్శకురాలి చేతుల్లో రూపొందిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’ అనే చెప్పాలి. అంటే.. ఇది కేవలం యశ్ సినిమా మాత్రమే కాదు.. ఓ మహిళా దర్శకురాలి పేరుతో నమోదవుతున్న భారీ రికార్డ్ కూడా. ఇప్పటివరకు మహిళా దర్శకులు ఎన్నో అద్భుతమైన కథలు చెప్పారు.. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.. కానీ వందల కోట్ల కమర్షియల్ టెంట్‌పోల్ సినిమాను డీల్ చేయడం మాత్రం చాలా అరుదు. ఆ గ్యాప్‌ను గీతూ మోహన్‌దాస్ ‘టాక్సిక్’తో ఫిల్ చేస్తున్నారనే చెప్పాలి.

Advertisement

చిన్న సినిమాల నుంచి.. భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వరకు.. గీతూ ప్రయాణం ఇప్పుడు ఇండియన్ సినిమా ఫోకస్‌ను తనవైపు తిప్పుతోంది. ఓ మహిళా దర్శకురాలు వందల కోట్ల సినిమాను లీడ్ చేయడం.. అదే అసలు ‘టాక్సిక్’ రికార్డ్. ఈ మూవీగానీ హిట్ కొడితే.. గీతూ తప్పకుండా భారీ బడ్జెట్ మూవీతో సక్సెస్ సాధించిన ప్రముఖ మహిళా దర్శకుల జాబితాలోకి చేరిపోతారు.

Also Read: సంగీతం కోసం ఇంట్లోనే రచ్చ..‘జగమే సంగీతం’ట్రైలర్ చూశారా ?

Tags

Related News

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా?

పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న బాలయ్య కూతురు.. అక్కడి నుంచే పోటీ!

విజయ్‌ను ట్రోల్ చేసేవాళ్లు ఇది వినాల్సిందే.. హరీష్ శంకర్ స్ట్రాంగ్ ఆన్సర్!

నన్ను గెలికితే ఎవడినీ వదలను…విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్.. బుల్లిరాజు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

Big Stories

Advertisement
×