E-Paper
Advertisement

మాసోడు అప్పుడే మొదలెట్టేశాడురో.. షూటింగ్ అప్పుడే స్టార్ట్..?

మాసోడు అప్పుడే మొదలెట్టేశాడురో.. షూటింగ్ అప్పుడే స్టార్ట్..?
Advertisement

Raviteja : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం ఇరుముడి.. ఆగస్టు 21న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం భారీ విజయం సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఒకవైపు సినిమాకి విమర్శలు ఎదురైనప్పటికీ సినిమా కలెక్షన్స్ లో మాత్రం లోటు కనిపించలేదు. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు 80 కోట్లకు పైగా వసూలను సాధించడం మామూలు విషయం కాదు. ఇప్పటివరకు వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ఈ సినిమా మంచి బూస్ట్ ను ఇచ్చింది. రవితేజ నటించిన ధమాకా తర్వాత ఈ మూవీతో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో అప్పుడే మరో కొత్త సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆ మూవీ షూటింగ్ వివరాలను ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

రవితేజ – దిల్ రాజు మూవీ..

టాలీవుడ్ హీరో రవితేజ, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీగా మారెందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇరుముడి సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు దిల్ రాజు తో ఓ సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. సినిమా గురించి ఇంకా పూర్తి వివరాలను వెల్లడించక ముందే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 28 నుంచే మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. లింగంపల్లి, బీహెచ్ఈఎల్ లో ఎంపిక చేసిన లొకేషన్లో షూటింగ్ చేస్తున్నట్లు టాక్.. త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

మాసోడు మొదలెట్టేశాడురోచ్..

Advertisement

రవితేజ ఈమధ్య హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలలో నటించారు. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆయనకు బిగ్గెస్ట్ ను అందుకునేలా చేయలేదు.. గత కొన్నేళ్లుగా రవితేజ ఖాతాలో పెద్దగా హిట్ సినిమాలు మాత్రం పడలేదు. దాంతో ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫిక్స్ అయినా రవితేజ డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడు మాస్ యాక్షన్ స్టోరీలతో వచ్చే ఈయన ఈసారి దేవుడిని నమ్ముకోవడంతో ఆ సినిమా హిట్ అయ్యింది. డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఇరుముడి మూవీ రోజురోజుకు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయి కేవలం వారం రోజులు కూడా కాకముందే రవితేజ మరో సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మాసోడు మళ్లీ మొదలెట్టాడురో అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ను ఫిక్స్ చేస్తారు? అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది..

Also Read :హీరోయిన్ ను నమ్మించి మోసం చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. పోలీసు కేసు నమోదు..

Related News

అందరి చూపు ఆమె వైపే.. గీతూ గట్టెక్కుతారా? ‘టాక్సిక్’తో ఆ జాబితాలోకి చేరతారా?

హీరోయిన్ ను నమ్మించి మోసం చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. పోలీసు కేసు నమోదు..

యష్ ‘టాక్సిక్ ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

హైదరాబాద్‌లో ఈ థియేటర్లు ఉండేవని తెలుసా..?

యూత్‌ను టార్గెట్ చేసిన ‘రోమాంచకం’.. ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది!

మహేష్–అనిల్ కాంబోకు బ్రేక్? దర్శకుడి మాటల్లో అసలు మ్యాటర్!

ఇరుముడిలో నాగులు.. ఈ క్యారెక్టర్‌ వెనుక ఇంత కథ ఉందా?

Big Stories

Advertisement
×