E-Paper
Advertisement

సుడిగాలి సుధీర్ పై మనసు పారేసుకున్న సీరియల్ హీరోయిన్?

సుడిగాలి సుధీర్ పై మనసు పారేసుకున్న సీరియల్ హీరోయిన్?
Advertisement

Sudigali Sudheer:బుల్లితెరపై సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)కి ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షోలలో మ్యూజిషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి స్క్రిప్టు రైటర్ గా , కమెడియన్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న జబర్దస్త్ లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో టీం లీడర్ గా ఎదిగి సుడిగాలి సుధీర్ గా పేరు సొంతం చేసుకున్నారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ పలు షోలలో సందడి చేసిన సుధీర్ .. ఢీ వంటి డాన్స్ షోలకి హోస్ట్ గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.

సుధీర్ పై సీరియల్ హీరోయిన్ ప్రేమ..

ఇక బుల్లితెరపై భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన అటు సినిమాలలో కూడా హీరోగా సత్తా చాటారు. ప్రస్తుతం G.O.A.T అనే చిత్రంలో నటిస్తూనే.. మరొకవైపు ఫ్యామిలీ స్టార్స్, డ్రామా జూనియర్స్ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇకపోతే సుడిగాలి సుధీర్ షోలకంటే కూడా ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) తో రిలేషన్ కారణంగా నిత్యం వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య అలాంటి బంధం లేకపోయినా.. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు.పైగా వీరిద్దరికి షోలలో పెళ్లి చేసి షో టీఆర్పీ రేటింగ్ పెంచుకున్న విషయం తెలిసిందే. దీంతో నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అభిమానులు కూడా కోరుకున్నారు. అయితే వీటిపై స్పందించిన సుధీర్ టీమ్ వీరిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు సుధీర్ పై ఒక సీరియల్ హీరోయిన్ మనసు పారేసుకుంది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:వారణాసి కోసం సందీప్ కీలక నిర్ణయం.. ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

నువ్వే నా ప్రాణం అంటున్న సీరియల్ హీరోయిన్..

ఆమె ఎవరో కాదు దీపిక రంగరాజు(Deepika Ranga Raju).. సీరియల్స్ ద్వారా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో పలు షోలలో తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సుమ కనకాల (Suma kanakala) నిర్వహిస్తున్న ‘చెఫ్ మంత్ర ప్రాజెక్టు కే ‘ కుకింగ్ షో తో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ షోని అమెరికాకు మార్చారు. చెఫ్ మంత్ర ప్రాజెక్టు యూఎస్ఏ సీజన్ 5 లేటెస్ట్ ఎపిసోడ్ నిర్వహించగా.. అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ షో కి సుధీర్ గెస్ట్ గా రాగా.. కుకింగ్ చేసే అమ్మాయిగా దీపిక , యాదమ్మ రాజు జంటగా వచ్చారు. సుధీర్ తన పెళ్లికి వంటలు కావాలని, అందుకోసమే ఇక్కడికి వచ్చానని చెబుతాడు. స్టేజ్ పైకి దీపికా రంగరాజు ఎంట్రీ ఇవ్వగానే సుదీర్ ని పిలుచుకొచ్చి స్టేజ్ పై ఉంచి, ఆయనతో డాన్స్ చేసింది. సార్ సినిమాలోని మాస్టారు సాంగ్కు సుదీర్ పక్కన స్టెప్పులేసింది. దీపికాతో పాటు వచ్చిన యాదమ్మ రాజు నీ జోడి ఎవరు అని అడిగితే సుధీర్ అని చెబుతుంది. రియల్ జోడి కాదు రీల్ జోడి అంటూ కామెంట్ చేస్తాడు యాదమ్మ రాజు.

నువ్వు ఏం చేసినా కామ్ గా వెళ్ళిపోతాను – దీపికా రంగరాజు

Advertisement

దీనికి సుధీర్ షోలో జోడి అను.. రియల్ జోడి ఏంటి అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఆ తర్వాత సుమ మాట్లాడుతూ ..” ఈ చేతిలో పేపర్ ఏంటి? ప్రతిసారి ఏదో ఒక సర్టిఫికెట్ పట్టుకొని వస్తావని..” అడగ్గా ఇది కంప్లైంట్ పేపర్ అంటూ దీపికా చెబుతుంది. ఇక సుధీర్ మాట్లాడుతూ.. “నేనేం చేశాను నిన్ను అసలు.. నా దగ్గర నీ నెంబర్ కూడా లేదు” అని భయంతో చెబుతుంటే..” నువ్వు ఏం చేసినా కామ్ గా వెళ్ళిపోతాను కానీ.. కంప్లైంట్ అయితే ఇవ్వను” అంటూ తన ప్రేమను వలకబోసింది. మొత్తానికైతే ఫన్ గా సాగిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Big Stories

Advertisement
×