Hyper Aadi : ఫోక్ సాంగ్స్‌తో యూట్యూబ్‌లో సూపర్ ఫేమ్ సంపాదించుకున్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.. ఏ ఫోన్లో చూసినా వీళ్ళిద్దరి వీడియోనే కనిపిస్తుంది.. ఏ నోట విన్నా వీళ్ళిద్దరి గురించి వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ జంట గురించి సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. ఈశ్వర్ సాయి భార్య చేసింది ముమ్మాటికీ తప్పే అంటూ మండిపడుతున్నారు. నిజా నిజాలు ఏంటో తెలుసుకోకుండా ఒక అమ్మాయి గురించి నిందలు వేయడం తప్పు అంటూ ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇప్పుడు తాజాగా జబర్దస్త్ కమెడియన్ సినీ నటుడు హైపర్ ఆది స్పందించారు.. ఆయనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. అసలు ఆది ఏమన్నాడు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది శాంతి స్వరూప్ తో కలిసి ఒక వీడియోని చేసి దాన్ని సోషల్ మీడియాలో రిలేషన్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. అందులో హైపర్ ఆది మాట్లాడుతూ.. ఒకరి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు అంటూ శాంతితో అన్నారు.. ఇటీవల ఒకరి అభిప్రాయాలు ఏంటో తెలుసుకోకుండా ట్రోల్స్ చేయడం కామన్ అయిపోయింది.. తాజాగా చూస్తే ఫోక్ డాన్సర్ మాధురి గురించి వస్తున్న వార్తలు నన్ను బాధ పెడుతున్నాయి అని ఆది అన్నారు.. వాళ్ల పర్సనల్ విషయాలని బయట పెట్టడం తప్పు. ఎన్నో ఏళ్లుగా కలిసి పని చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం ఉండడం కామన్ అలాంటిది ఏదో తెలిసో తెలియకో చేసిన పొరపాటున తప్పును.. కానీ అది బయటపెట్టి ఆ అమ్మాయి పరువు తీయడం అంత మంచిది కాదు కదా అని ఆది అంటాడు.. ఇప్పుడు ఈశ్వర్ సాయికి అయితే పెళ్లయింది.. ఆ అమ్మాయి ఇంకా పెళ్లి కాని అమ్మాయి.. అలాంటి అమ్మాయి పరువు పోయింది ఇప్పుడు అమ్మాయికి పెళ్లి అవుతుందా అంటూ ఆది అన్నారు.. అంతే కాదు ఒకరి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. ముఖ్యంగా అమ్మాయిలు గురించి తెలియకుండా ఏది అనకూడదు అంటూ ఆ వీడియోలో ఆది చెప్పారు. ఆ వీడియో నే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
?igsi=MXEwa29kNHJrOXljNQ==
హైపర్ ఆది ఏం చేసినా కూడా అది క్షణంలో సెన్సేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మాధురికి సపోర్ట్ చేస్తూ ఆయన చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఆది వీడియో చూసిన తర్వాత నెటిజన్లు కూడా మాధురి తప్పు ఏమీ లేదు అంటూ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేలా వీడియోలు తీయడం తప్పు అంటూ ఆ వీడియోకి కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఆది వీడియోతో మాధురికి చాలామంది సపోర్ట్ గా నిలుస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే రీసెంట్ గా ఈశ్వర సాయి మాధురి తప్పేమీ లేదు అంటూ ఒక వీడియో ని షేర్ చేసిన విషయం తెలిసిందే. మరి ఆ వీడియో ఇప్పటికే నెట్టుంటా ట్రెండ్ అవుతూనే ఉంది. అటు ఈశ్వర సాయి భార్య పై మాధురి పెట్టిన కేసు ఎంతవరకు వచ్చింది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది. మరి ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో అన్నది ప్రస్తుతం చర్చినీయాంశంగా మారింది…