Irumudi Press Meet: సినిమా ఇండస్ట్రీలో లో ప్రొఫైల్ మైంటైన్ చేసే స్టార్ హీరోల కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం తర్వాత ఎక్కువగా వినిపించే పేరు రవితేజ ఫ్యామిలీ. ఇండస్ట్రీలో ఎన్నో సినిమా ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది సెలబ్రిటీలు వాళ్ళ ఫ్యామిలీలతో వచ్చి సందడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫలానా హీరోల సినిమాలు విడుదలవుతున్నాయన్నా.. లేదా ఈవెంట్లు జరుగుతున్నాయన్నా సరే కచ్చితంగా వారి ఫ్యామిలీలు సందడి చేస్తాయన్న విషయం తెలిసిందే. కానీ రవితేజ మాత్రం ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఆయన భార్య, ఆయన పిల్లలు ఎప్పుడూ కూడా మీడియా ముందుకు రాలేదు. కానీ తొలిసారి రవితేజ కూతురు మోక్ష ఇరుముడి సినిమా స్టోరీ చెప్పమని డైరెక్టర్ శివ నిర్వాణను కోరిందట. స్టూడియోలో సినిమా స్టోరీ విని ఆ తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంది అన్న విషయాన్ని శివ నిర్మాణ తాజాగా పంచుకున్నారు.
డైరెక్టర్ శివా నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ఇరుముడి. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ వేదికగా ఇరుముడి బ్లాక్ బాస్టర్ ప్రెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు.అందులో డైరెక్టర్ శివా నిర్వాణ మాట్లాడుతూ రవితేజ కూతురు సినిమా స్టోరీ పై చూపించిన ఇంట్రెస్ట్ ని స్టోరీ విన్నాక ఆమె రియాక్షన్ ను ఆయన పంచుకున్నారు. “ఇరుముడి స్టోరీ చర్చల్లో ఉన్నప్పుడు రవితేజ కూతురు మోక్ష స్వయంగా ఆఫీస్ కి వచ్చి కథ విన్నారు. నిజానికి మోక్ష మోడ్రన్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి. కథ ఎలా రిసీవ్ చేసుకుంటుందో అనుకున్నాను. అయితే నేను కథ చెబుతున్నప్పుడు ఆమె తన తండ్రి రవితేజను ఆ పాత్రలో ఊహించుకుంటూ విన్నారు.
ఒక కీలకమైన ఎమోషనల్ సీన్ వివరిస్తున్నప్పుడు ఆమె ఒక్కసారిగా నా రెండు చేతులు పట్టుకొని ఒక్క క్షణం ఆగండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు . గొంతు పూడుకుపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ స్టాఫ్ ఇటు సర్ ఇది నేను థియేటర్లలో చూడలేను. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మొన్న ఎడిటింగ్ రూమ్లో కూడా ఆమె ఆ సినిమాను చూడలేదు. కానీ రీసెంట్ గా సినిమా చూసింది అంటూ మోక్ష ఇరుముడి స్టోరీ విని తనను తాను ఊహించుకుంటూ ఏడ్చేసిన విధానాన్ని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
also read:కళ్ళు చెదిరే లుక్ లో పాయల్.. సైమా నామినేషన్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!
అలాగే రవితేజ డెడికేషన్ గురించి మాట్లాడుతూ..”అయ్యప్ప స్వామి భిక్ష సన్నివేశాలు చేసేటప్పుడు షర్టు విప్పడానికి కూడా వెనకాడలేదు. రవితేజ హీరోయిజం కంటే నిజాయితీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇంటర్వెల్ ముందు సాధారణ విలన్ చేతిలో రవితేజ దెబ్బలు తినే సన్నివేశం రాసినప్పుడు ఫాన్స్ ఏదైనా అంటారేమో అని ఆలోచించాను. ఈ విషయాన్ని ఆయనతో చెబితే ఆయన కథను అంగీకరించారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ నవీన్ , హీరో రవితేజ, మేనేజర్ శ్రీనివాస్ రాజు అందరూ కథ వింటూనే కన్నీళ్లు పెట్టుకున్నారు. వీళ్లంతా సినిమా కలెక్షన్స్ లెక్కలు చూడలేదు. కేవలం ఎమోషన్ ని మాత్రమే చూశారు. ఆ ఎమోషన్ ఈరోజు ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది” అంటూ తెలిపారు శివా నిర్వాణ.