Payal Rajput:అందం, అభినయంతో గ్లామర్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే పాయల్ రాజ్ పుత్ తాజాగా కళ్ళు చెదిరే లుక్ లో కనిపించి అందరి దృష్టిని తనవైపు లాగేసుకుంది.ముఖ్యంగా ఈ లేటెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ డ్రెస్ ఈమె అందాన్ని రెట్టింపు చేసింది. విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులో జరిగిన ప్రైవేట్ SAIMA నామినేషన్ పార్టీలో తన గ్లామరస్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ డిజైనర్ అశ్విని రెడ్డి తాజా కాక్ టెయిల్ కౌచర్ కలెక్షన్ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ వేర్ లో ఆమె మెరిశారు.

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో గుర్తింపు పొందిన పాయల్ రాజ్ పుత్, తనదైన కాన్ఫిడెన్స్ గ్లామర్ తో ఈ ప్రత్యేక లుక్ ను మరింత ఆకర్షణగా మార్చేసింది.ఆధునిక సిల్హౌట్ , ప్రత్యేకమైన డీటెయిలింగ్ రూపొందించిన ఈ డిజైన్..అశ్విని రెడ్డి కౌచర్ శైలిని ప్రతిబింబించింది.
also read:స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కొమరం..

పాయల్ ఆకర్షణీయమైన ప్రజెంట్స్ కి , అశ్విని రెడ్డి డిజైన్ లోని సొగసైన నైపుణ్యం తోడవడంతో ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైన ఫ్యాషన్ మూమెంట్గా నిలిచింది. ఆధునిక సాయంత్రపు గ్లామర్ కు కొత్త రూపాన్ని అందించేలా ఈ లుక్కును డిజైన్ చేశారు.

అశ్విని రెడ్డి తాజా కాక్ టెయిల్ కౌచర్ కలెక్షన్ ఆధునిక లగ్జరీ, సొగసైన సిల్హౌట్స్ , స్టేట్మెంట్ డీటెయిలింగ్ తో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. పాయల్ తన కాన్ఫిడెంట్ స్టైల్ తో ఈ డిజైనర్ క్రియేషన్ కి మరింత గ్లామర్ను జోడించింది. మొత్తానికైతే పాయల్ రాజ్ పుత్ , అశ్విని రెడ్డి కాంబినేషన్లో రూపొందించిన ఈ ఫ్యాషన్ మూమెంట్ ప్రైవేట్ సైమా నామినేట్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక పాయల్ రాజపుత్ విషయానికి వస్తే..RX 100, మంగళవారం సినిమాలతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె త్వరలో మరో మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.
