E-Paper
Advertisement

మాధురిని కావాలనే టార్గెట్ చేశారా..? వీడియోతో క్లారిటీ వచ్చేసిందిగా..

మాధురిని కావాలనే టార్గెట్ చేశారా..? వీడియోతో క్లారిటీ వచ్చేసిందిగా..
Advertisement

Madhuri – Eswar Sai : ప్రముఖ ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ అలాగే డాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం రోజు రోజుకి ముదురుతుంది. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ ఈశ్వర సాయి భార్య చేసిన హంగామా వల్ల ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఆ తర్వాత మా ఆయన మంచివాడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలోనూ ఇటు జనాలను ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఈశ్వర్ సాయి భార్యపై మాధురి రాథోడ్ పెట్టిన కేసు వల్ల ఈ కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా మాధురికి ఈశ్వర్ సాయి క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.. అసలు ఆ వీడియోలో డ్యాన్సర్ ఈశ్వర్ సాయి ఏం చెప్పాడు..? ఇది ఏమైనా పాపులర్ అయ్యేందుకు ప్లానా?అసలు వ్యవహారం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. మరి దీనిపై జనాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం..

మాధురి రాథోడ్ కు క్షమాపణలు..

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి స్పందించారు. ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని., ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన చెందారు సాయి. ‘అసలేం జరుగుతోంది. మీరంతా ఏం అనుకుంటున్నారు? ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు.. నిజానికి నాకు షూటింగ్ ఉండటంతో నేను రెడీ అవుదామని ముందుగా లేస్తే నా అసిస్టెంట్ నా వాష్ రూం వాడుతున్నాడు. దీంతో మాధురి రూంకు వాష్ రూం వాడుకునేందుకు వెళ్లాను.. అదే టైంలో నా వైఫ్ నా మీద అనుమానం తో వేరే ఎవరినో తీసుకొని వచ్చి హంగామా చేసింది అని అతను అన్నారు. మాధురి రాథోడ్, నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయి మాట్లాడుకుంటాం తప్పితే అంతకు మించి మా మధ్య ఏదీ లేదని చెప్పారు. మాధురికి ఎటువంటి పాపం తెలియదు తన తప్పేమీ లేదు అంటూ చెప్పడంతో పాటుగా క్షమాపణ చెప్పాడు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మాధురి రియాక్ట్ అయ్యిందా..?

Advertisement

మా ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ తప్ప ఏమీ లేదు. ఏమీ జరగలేదు. అమ్మా మాధురి నీకు నా తరఫు నుంచి నా భార్య తరఫు నుంచి నా భార్య వెనకున్న వారి తరఫు నుంచి క్షమాపణ కోరుతున్నా.. నన్ను క్షమించమ్మా వాళ్ళకి ఏం జరిగింది అన్నది తెలియకుండానే ఇలా పెట్టారు.. దయచేసి తప్పుగా అనుకోకు అని అతను చెప్పిన వీడియో పై ఇప్పటికే నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.. ఫస్ట్ నువ్వేంటో నీ భార్యకు క్లారిటీ ఇవ్వు.. ఊరికే నోరు ఉంది కదా అని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం అయ్యేలా చెయ్యొద్దు అంటూ నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. మరి ఈ వీడియో పై మాధురి రాథోడ్ రియాక్ట్ అయిందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ కి మారింది. ఈశ్వర్ సాయి భార్య పై మాధురి పెట్టిన కేసు గురించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఇక మరికొందరు నెటిజన్లు మాత్రం వీళ్ళిద్దరూ త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 10 కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఇలాంటి స్టెంట్లు చేసి ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈశ్వర్ సాయి వీడియోతో ఒక క్లారిటీ అయితే వచ్చింది.. మరి ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా? లేదా ఇంకా ఏదైనా ట్విస్ట్ తో ముందుకు సాగుతుందా అన్నది చూడాలి..

Also Read : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Related News

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

Big Stories

Advertisement
×